
కోలీవుడ్ మూవీ 'వెట్టువం' సెట్‌లో స్టంట్‌మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ పా రంజిత్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ నటుడు వినోద్, నీలం ప్రొడక్షన్స్కు చెందిన రాజ్కమల్, కారు యజమాని ప్రభాకరన్పై కేసు నమోదైంది. ఈ సంఘటన సమయంలో సినిమా సెట్లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. స్టంట్‌మ్యాన్ రాజు సినిమా సెట్‌లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు. కాగా.. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది.