
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను హాజరుపర్చనున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.