breaking news
conspiracy
-
కుట్ర అడ్డం తిరిగింది.. అడ్డంగా ఇరుక్కున్న బాబు.. పవన్
-
బాబు తొలి సంతకం.. ఘరానా మోసం
-
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్‌ను హాజరుపర్చనున్నారు.వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
Magazine Story: రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
-
టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్‌కు 'పచ్చ' స్కెచ్
సాక్షి, విజయవాడ: టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది. మద్యం బార్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. 840 బార్లలో 52 బార్లకే ఆఫ్లికేషన్లు దాఖలయ్యాయి. బార్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంది. భారీగా మార్జిన్ పెంచుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది.లిక్కర్ సిండికేట్‌కి సరెండర్ అయిన చంద్రబాబు సర్కార్.. 29వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు పెంచింది. మంత్రి వర్గం ఉపసంఘం ద్వారా మార్జిన్ పెంచుకోవడానికి లాబీయింగ్ చేశారు. ఇతరులెవ్వరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకొనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగారు.ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని గుర్తించిన టీడీపీ నేతలు.. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం. -
చింతమనేని రెడ్ బుక్ అరాచకాలు.. నా కొడుకుని వదిలేయండి..
-
జగన్ చెప్పిందే నిజమైంది.. అమ్మకానికి స్టీల్ ప్లాంట్!
-
Magazine Story: దివ్యాంగుల నోటికాడ కూడు లాక్కొని ఏం సాధిస్తావు బాబు?
-
విద్యుత్ కొనుగోలులో బయటపడ్డ బాబు కుట్ర
-
అడ్డదారిలో గెలవడమే బాబు సిద్ధాంతం
-
రీపోలింగ్ లో కూడా రిగ్గింగే..
-
బోగస్ ఎలక్షన్.. కాళ్లు పట్టుకున్నా కనికరించలే..!
-
YS Avinash Reddy: ఇంత చెత్త ఎన్నికలు రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు..
-
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు
-
ఫ్యాక్షన్ పాలిటిక్స్.. పులివెందులలో పోలింగ్ కేంద్రాలపై కూటమి కుట్ర
-
GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. అడ్డదారిలో గెలిచేందుకు కూటమి కుట్రలు
-
కేసిరెడ్డి కేసులో.. బాబుకు ఊహించని దెబ్బ
-
ఆ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని ఇరికించే కుట్ర
-
SIT సీన్ రివర్స్.. కోర్టు నుంచి పరార్.. అబ్బా కథ అడ్డం తిరిగిందే
-
రండి.. దోచుకోండి! కార్పొరేట్ సంస్థలకు బాబు బంపరాఫర్
-
దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు
-
KSR Live Show: జగన్ దెబ్బతో మీడియా ముందుకు పరుగులు తీసిన టీడీపీ..
-
నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా..
-
Big Question: ఎన్ని కుట్రలు చేసిన జనం ఆగరు.. జగన్ ఆగడు..
-
నేడు నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
KSR Comment: అమరావతి పేరుతో రైతులను నట్టేట ముంచిన భూబకాసురులు
-
ప్రత్యర్థి పార్టీ నేతలే టార్గెట్ గా తప్పుడు కేసులు
-
తండ్రిపై కక్షతో.. మిథున్ రెడ్డి జైలుకు
-
బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర
కోల్‌కతా: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి.. బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పుగా ఉన్న బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తామని, ఆ తరువాత కేంద్రంలో ఓడించేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జరిగిన ర్యాలీలో మమత ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీలను ఆ పార్టీ వేధిస్తోందని, బెంగాలీ కమ్యూనిటీ గుర్తింపును తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాలీ చిహ్నాలను సైతం అవమానించే దుష్ట చర్యలకు పాల్పడుతోందని, 2019లో ఆ పార్టీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బెంగాలీ ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించడం, నిర్బంధ శిబిరాలకు తరలించడం చేస్తోందన్నారు. ఎంత మందిని జైలులోపెడతారో చూస్తానని, ఈ వేధింపులు ఆపకపోతే తమ ప్రతిఘటన ఉద్యమం ఢిల్లీకి చేరుకుంటుందని హెచ్చరించారు. బెంగాలీ భాష, సంస్కృతిపై బీజేపీ దాడికి వ్యతిరేకంగా జూలై 27 నుంచి బెంగాల్లో ఒక ఉద్యమం ప్రారంభమవుతుందని మమత ప్రకటించారు. ధర్నాలకు సిద్ధం కండి.. బెంగాలీలకు ఎన్ఆర్సీ నోటీసులు పంపే హక్కు అస్సాం ప్రభుత్వానికి ఎవరిచ్చారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 1.5 కోట్ల మంది వలసదారులకు బెంగాల్ నిలయంగా ఉందని ఆమె వెల్లడించారు. భారత నలుమూలల నుంచి ప్రజలను తాము స్వాగతిస్తున్నామని, కానీ బీజేపీ మాత్రం బెంగాలీలపై వేధింపులకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ కుట్రకు పాల్పడుతోందని ఆమె రోపించారు. వారు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ద్వారా చేసినట్లు బెంగాల్లో కూడా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ‘బిహార్‌లో 40 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇక్కడ కూడా ప్రయత్నిస్తే అనుమతించబోం. మేం అడ్డుకుంటాం’అని మమత హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బెంగాలీని నిర్బంధించినా లేదా వేధించినా, ఇక్కడ వారికి సంఘీభావం ప్రకటించడానికి ధర్నాలో కూర్చోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీది సూపర్ ఎమర్జెన్సీ.. దశాబ్దాల కిందటి కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ.. ఇప్పుడు దేశంలో సూపర్ ఎమర్జెన్సీ అమలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అంటున్నారని, 11 ఏళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని మమత ప్రశ్నించారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉన్న మీరు.. మాకు ఉపన్యాసాలు ఇస్తారా?’అని ఇటీవల బెంగాల్లో జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీ ప్రసంగాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. సంకెళ్లతో బంధించి మరీ సైనిక విమానాల్లో భారతీయ వలసదారులను అమెరికా బహిష్కరించినప్పుడు బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. టెలిప్రాంప్టర్ చూసి బెంగాలీలో మాట్లాడి బెంగాలీల హృదయాలను గెలుచుకోగలరని అనుకుంటున్నారని, పాక్ అక్రమిత కశ్మీర్‌ను ఆక్రమించలేకపోయిన బీజేపీ.. బెంగాల్ గురించి కలలు కనడం మానేస్తే మంచిదని హితవు పలికారు. బెంగాల్లో మహిళల భద్రతపై మాట్లాడుతున్న బీజేపీ.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింస గురించి సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. బెంగాల్ హింసాత్మక కేసులలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దీదీ స్పష్టం చేశారు. -
రాజకీయ కుట్రలో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్
-
KSR Live Show: బనకచర్లపై గురుశిష్యుల చీకటి ఒప్పందం
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర?
-
చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు మాకు సహకరించలేదు: వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలను అడ్డుకునేందుకు కుట్ర
-
సాక్షి బ్యాన్.. బాబులో భయం
-
జగన్ ను చంపేస్తా..! బాబు కుట్ర బయటపెట్టిన కారుమూరి
-
జగన్ భద్రతపై కుట్రలు.. హైకోర్టు చివాట్లు పెట్టినా మారని బాబు
-
జగన్ పర్యటనకు వెళ్తే.. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం..!
-
అంత భయమెందుకు లోకేశ్? జగన్ చిత్తూర్ పర్యటనపై సీక్రెట్ మీటింగ్
-
మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం?..
-
వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు టీడీపీ నేతల అడ్డంకులు
-
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
-
జగన్ పై కుట్ర.. టీడీపీ ఆఫీస్ నుంచే ప్లాన్
-
చేసేది మేమే.. నిజం ఒప్పుకున్న లోకేష్
-
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్.. అదిగో కుట్ర - ఇదిగో సాక్ష్యం..
-
జగన్ ప్రజల మనిషి.. కారు సీజ్ చేస్తే బస్సులో వెళ్తాడు..
-
KSR Live Show: డ్రైవర్ పై ఒత్తిడి.. అబద్ధపు వాగ్మూలంతో జగన్ ను ఇరికించేందుకు కుట్ర..!
-
కూటమి కుట్ర.. ప్రెస్ మీట్ లో మాట మార్చిన ఎస్పీ సతీష్
-
జగన్ భద్రతపై బాబు కుట్ర..!
-
సింగయ్య మరణంపై ‘ఎల్లో గ్యాంగ్’ కుట్ర రాజకీయం
సాక్షి, గుంటూరు: సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసింది. వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. 18వ తేదీన 1:20 గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారు.ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని.. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు చెప్పిన ఎస్పీ.. AP 26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత కుట్రకు తెరలేపిన టీడీపీ, ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ వాహనం ఢీ కొనలేదని ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించారు. అయినా వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా బురదచల్లుతోంది. -
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ..!
-
రప్పా.. రప్పా.. ఎస్ పప్పా!
-
తెలుగుదేశం పార్టీ నాయకుల దొంగ నాటకాలు బట్టబయలు
-
ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.వైఎస్సార్సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్ సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది. బయటపడిన అసలు నిజాలు పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు. బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్ జగన్ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కొత్త రాగం వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు. -
Big Question: జగన్ మళ్ళీ వస్తే వామ్మో.. వణుకు మొదలాయె
-
‘వైఎస్ జగన్ పల్నాడుకు వెళ్తే.. బాబు సర్కార్‌కి భయమెందుకు?’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబు సర్కార్‌కు ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైఎస్ జగన్‌కు ఉందన్నారు.‘‘స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే. పొదిలిలో వైఎస్ జగన్‌కు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం భయపడుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. చంద్రబాబు సర్కార్ బ్రిటీష్ చట్టాలను అమలు చేసి వైఎస్సార్సీపీని అణచి వేయాలని చూస్తోంది. 30 యాక్ట్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం‘‘శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని శైలజానాథ్ పేర్కొన్నారు. -
జగన్ టూర్ లో టీడీపీ కుట్ర.. ఎల్లో మీడియానే సాక్ష్యం
-
ఇంటిపైకి ఎక్కి.. రాళ్లు, చెప్పులతో దాడి.. 3 కానిస్టేబుల్స్ తలకి గాయాలు
-
బాబు కర్కశం.. రైతు ద్రోహి
-
జైలుకు పంపాక కూడా కొమ్మినేనిపై మరో కుట్ర..
-
KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
-
తెనాలి సాక్షిగా బయటపడ్డ.. జగన్ పై మరో భారీ కుట్ర
-
కూటమి సర్కారు వసూళ్ల పర్వం.. బేరంకుదిరితేనే బదిలీ
-
హ్యాండర్లతో టచ్‌లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!
విజయనగరం: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారించారు.ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్, సమీర్లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు. ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్‌ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. -
వంశీ తప్పు చేయలేదు.. బాబు బయటపెట్టిన నిజాలు
-
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్‌నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..
-
వరుస కేసులతో వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
బాబు కుట్రను ఆధారాలతో బయటపెట్టిన బోండా ఉమా
-
Big Question: రిమాండ్ రిపోర్టుల సాక్షిగా బయటపడుతున్న బాబు కుట్ర
-
కుట్టు స్కీమ్ లో స్కామ్
-
అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణం.. ఇంత నిర్లక్ష్యమా?
-
KSR Live Show: అమరావతి కేరాఫ్ అవినీతి
-
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి అరాచక రాజ్యం
-
సింహాచలం ఘటన నుంచి తప్పించుకునేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు
-
నిప్పుతో చెలగాటం.. పాక్ కు కుక్క చావే
-
పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర
-
Big Question: నారా వారి సారా కథలు
-
సిట్ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు
-
మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులకు కూటమి సర్కారు టోకరా
-
విశాఖలో ఎకరా స్థలం 99పైసలే.. రండి బాబు రండి!
-
Magazine Story: విశాఖ మేయర్ పీఠంపై పచ్చ ముఠా బరితెగింపు
-
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోత
-
Big Question: వినుకొండ నుండి రాప్తాడు వరకు.. ప్రమాదంలో జగన్ భద్రత
-
చెమటలు పుట్టిస్తున్న జగన్ పర్యటన.. భయపడే కూటమి కుట్రలు
-
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు
-
కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు దుర్గతి
-
భక్తి లేదు.. భయం కూడా లేదా? దేవుడిపైనే పచ్చ కుట్రలు!
-
Big Question: జగన్ భద్రతపై నిర్లక్ష్యమా? కూటమి ప్రభుత్వ కుట్రనా?
-
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సోదరుడి అరెస్ట్ లో కక్షసాధింపు
-
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు కూటమి ప్రభుత్వం కుట్ర
-
KSR Live Show: ముస్లింలను మోసం చేసి.. షర్మిలతో డైవర్షన్ పాలిటిక్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు
-
ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు
-
పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో చంద్రబాబు చెలగాటం
-
‘రెడ్‌బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అంతా కనికట్టు.. ఆధారం ఉంటే ఒట్టు!
-
సునీతా స్పేస్ ప్రయాణం.. బైడెన్ భారీ కుట్ర?
-
కృష్ణా జలాల వినియోగంపై చోద్యం చూస్తున్న ఏపీ ప్రభుత్వం
-
మిర్చి రైతుకు మోసం
-
లోకేష్ టీడీపీలోకి రమ్మన్నారు.. పోసాని రియాక్షన్..
-
మెజిస్ట్రేట్ ఎదుట కన్నీరుపెట్టుకున్న పోసాని
-
చంద్రబాబు రాజకీయం అంతా మోసం, అబద్ధాలు
-
పోసాని కృష్ణ మురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు
-
కూటమి పాలనలో పాడి రైతుకు దగా
-
వివేకా కేసులో బాబు డ్రామాలు
-
అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి రాజముద్ర!
-
వైఎస్సార్ సీపీ యూత్ లీడర్ ఈశ్వర్ అరెస్ట్
నర్సీపట్నం(అనకాపల్లి): కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేస్తూ వైఎస్సార్సీపీశ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వరుస అరెస్ట్ లకు తెరతీసింది. ఆదివారం నర్సీపట్నం వైఎస్సార్సీపీయూత్ లీడర్ ఈశ్వర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేశాడని అక్రమ కేసు బనాయింది అరెస్ట్ చేశారు పోలీసులు. ఈశ్వర్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. ఈశ్వర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిలో భాగంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అయన్న పాత్రుడు పని చేస్తున్నాడు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే అధికారులు పని చేస్తున్నారు. ఈ శ్వర్ పై పెట్టిన కేసు అక్రమ కేసని పోలీసుల మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ అయ్యన్న ఒత్తిడి ముందు ఆలోచించి పనిచేస్తున్నారు. చీటింగ్ కేసులో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగడం ఆశ్చర్యం కల్గించింది’ అని పేర్కొన్నారు.ఇటీవల వైఎస్సార్ సీపీకి చెందిన నేత వల్లభనేని వంశీతో పాటు, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని సైతం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళి పట్ల కూటమి ప్రభుత్వ దాష్టీకం
-
సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు
-
తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లతో చెలరేగిపోతోన్న కూటమి సర్కార్
-
పోసాని ఎక్కడ?.. పోలీసుల కుట్ర!
-
సోషల్ మీడియాను మరింత అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు
-
జాడలేని కార్మికులు ఏపీ ప్రజలపై పెనుభారం!
-
నేడు యధాతథంగా గ్రూప్- 2 మెయిన్ పరీక్ష
-
వైఎస్ జగన్ భద్రతలోనూ చంద్రబాబు కుట్ర
-
జగన్ కు ఏం జరగాలని చంద్రబాబు ఇంత నీచానికి దిగజారాడు
-
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం
-
జగన్ భద్రతపై బాబు కుట్ర.. ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు
-
గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ పర్యటనతో కూటమి సర్కార్ కుట్రలు!
-
జగన్ భద్రత గాలికి.. చంద్రబాబు కుట్ర అదేనా
-
ప్రజల వ్యతిరేకతను జీర్ణించుకోలేక జగన్ పై కూటమి కుట్ర
-
టీడీపీ కుట్రలు బట్టబయలు
-
సైకో రాజ్యం.. సర్వం నాశనం
-
పవన్ ఎందుకో వెనుకపడ్డాడు
-
మున్సిపల్ ఎన్నికలలో కూటమి అరాచకాలు
-
40 మంది YSRCP కార్పొరేటర్లకు టీడీపీ వల
-
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బాలకృష్ణ
-
KSR Live Show: జగన్ కు భయపడే ఇదంతా!
-
KSR Live Show: లోకేష్ కు అంత సీన్ లేదు.. తండ్రీకొడుకుల దావోస్ టూర్ అట్టర్ ప్లాప్..
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
-
స్టీల్ ప్లాంట్ కార్మికులను సాగనంపేందుకు బాబు కుట్రలు
-
వైఎస్ జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను దెబ్బతీసేలా ప్రభుత్వం కుట్రలు
-
KSR Live Show: జగన్ పై కోపంతో విద్యావ్యవస్థపై చంద్రబాబు కుట్ర
-
తొక్కిసలాటను తొక్కేసే కుట్ర!
-
ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించేస్తోన్న కూటమి సర్కార్
-
జనం చచ్చినా.. చంద్రబాబుది అదే ట్రెండ్ !
-
కావాలనే ఆ టైం కి నోటీసులు అంటించారు
-
సచివాలయాలపై చంద్రబాబు మార్క్ రాజకీయం
-
ఏపీలో అన్నదాతపై ప్రకృతి పగ.. సర్కార్ దగా
-
Big Question: చంద్రబాబు భారీ కుట్ర.. ఏకంగా జడ్జిపైనే నిఘా!.. లూథ్రా చేతిలో పోలీసులు?
-
భేతాళ కథ.. అంతా బాబు కుట్ర!
-
ప్రతిపక్షం లేకుండా బాబు కుట్ర..
-
పోలవరంపై బాబు కుట్ర
-
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్‌ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బూచోడు.. లక్షల మంది స్టూడెంట్స్ కి విలన్
-
వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి రెడ్డి పీఏ అంటూ టీడీపీ నేతల విషప్రచారం
-
దిష్టిబొమ్మగా పోలవరం.. బాబు సర్కార్ కుట్రలు