కడపలో భారీ కుట్రకు తెరలేపిన కూటమి సర్కార్‌ | Chandrababu Govt Conspiracy In Local Body Elections October 25 Updates | Sakshi
Sakshi News home page

కడపలో భారీ కుట్రకు తెరలేపిన కూటమి సర్కార్‌

Oct 25 2026 9:34 AM | Updated on Oct 25 2026 10:35 AM

Chandrababu Govt Conspiracy In Local Body Elections October 25 Updates

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీలో కూటమి సర్కార్‌ కుట్రలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీ వేసిన నామినేషన్లలో 10 జడ్పీటీసీ స్థానాల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పెండింగ్‌లో పెట్టారు. వీరబల్లి, సుండుపల్లి, కొండాపురం, పోరుమామిళ్ళ, చక్రాయపేట, జమ్మలమడుగు, మైలవరం, వేంపల్లి, తోండూరు నామినేషన్లను కారణాలు చెప్పకుండానే పెండింగ్‌లో ఉంచారు. ఎందుకు పెండింగ్‌లో పెట్టారో, రిజెక్ట్ చేశారో తెలపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది,

కారణాలు తెలిపే నివేదిక ఇస్తే అప్పీలు చేసుకుంటామని వైఎస్సార్‌సీపీ కోరాగా.. సమాధానం చెప్పకుండా రిటర్నింగ్ అధికారి పెండింగ్‌లో ఉంచారు. పచ్చ పార్టీ నేతలతో ఒత్తిడితో పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కారణాలు లేకుండా నాలుగు నామినేషన్ల తిరస్కరించగా.. మరో 10 మండలాల వైఎస్సార్‌సీపీ నామినేషన్లు పెండింగ్‌లో పెట్టారు. నామినేషన్లు వేసే సందర్భంలో అడ్డుకునే కుట్రలు చేసిన టీడీపీ గూండాలు.. ఏడుగురు అభ్యర్థుల పత్రాలను చించివేశారు.

జడ్పీటీసీ 32 స్థానాల్లో నామినేషన్ పడటంతో అవాక్కయిన టీడీపీ.. ఎలాగైనా నామినేషన్లు తిరస్కరించి గెలవాలనే కుట్రకు తెరతీసింది. 32 స్థానాల్లో ఎన్నికలు జరిగితే జడ్పీ చైర్మన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందనే భయంలో టీడీపీ ఉంది. దీంతో స్క్రూటినీ పూర్తయిన తర్వాత కుట్రకు అధికారులు తెరలేపారు. పెండింగ్‌లో పెట్టిన నామినేషన్లను వెంటనే ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.

అన్నీ సక్రమంగా ఉన్నా కావాలని తిరస్కరించారంటూ వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. జడ్పీ చైర్మన్ పీఠం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందనే కారణంతో చంద్రబాబు సర్కార్‌ కుట్రలు చేస్తోందని.. ఈ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: నామినేషన్లలో ‘పచ్చ’ నకిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement