వాషింగ్టన్, డీసీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ప్రభుత్వం కూలిపోవడంపై అమెరికా మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' సంచలన కథనం ప్రచురించింది. అయిన ప్రభుత్వం కూలిపోవడానికి కేవలం ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కేవలం అవిశ్వాస తీర్మానం వల్ల కోల్పోలేదని దాని వెనక అమెరికా, పాకిస్థాన్ సైన్యం కుట్ర ఉందని కథనం ప్రచురించింది.
డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం
2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.యాధృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థవైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్‌తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.
ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలు
ఏప్రిల్ 2022, ఇమ్రాన్‌ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు.అనంతరం కొద్ది నెలలకు నవంబర్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
దీంతో 2025లో మునీర్ అధికారం మరింత పెరిగింది: నివేదిక ప్రకారం, రాజ్యాంగ మార్పుల అనంతరం అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ మరియు రక్షణ దళాల అధిపతిగా నియమించారు. దీంతో సైన్యం, రక్షణ మౌలిక సదుపాయాలు, పాకిస్తాన్ అణు కమాండ్‌పై ఆయన పట్టు మరింత బలపడింది.
పతాక స్థాయికి అమెరికా-పాక్ సంబంధాలు
ఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి.పాకిస్థాన్‌లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్‌లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్‌కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్‌లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
ముందే చెప్పిన ఇమ్రాన్
తన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా విదేశీ కుట్ర జరిగిందని ఆరోపించారు. 2022 మార్చిలో జరిగిన ఒక ర్యాలీలో, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ ఆయన ఒక కాగితాన్ని ఊపారు. ఈ కేసు ఆ తర్వాత సైఫర్ కేసుగా ప్రసిద్ధి చెందింది.


