దేశంలో అరాచకానికి విపక్షాల కుట్ర! | BJP Chief Nitin Nabin Alleges Opposition Plot To Disrupt Law And Order | Sakshi
Sakshi News home page

దేశంలో అరాచకానికి విపక్షాల కుట్ర!

Oct 11 2026 6:33 AM | Updated on Oct 11 2026 6:33 AM

BJP Chief Nitin Nabin Alleges Opposition Plot To Disrupt Law And Order

విదేశీ శక్తుల ప్రయత్నాలను తిప్పికొడతాం  

బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌ హెచ్చరిక 

సాక్షి, న్యూఢిల్లీ: దేశ శాంతిభద్రతలకు భగ్నం కలిగించడంతోపాటు, అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మండిపడ్డారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నైరాశ్యంతో విదేశీ శక్తుల కనుసన్నల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేజ్రీవాల్‌ మిత్రపక్షం సీజేపీ చేతులు కలిపాయని విమర్శించారు. 

ఈ రెండు వర్గాల మధ్య దేశంలో శాంతి, సామరస్యం, అభివృద్ధిని దెబ్బతీసేందుకు అత్యంత ప్రమాదకరమైన పోటీ నడుస్తోందని మండిపడ్డారు. ప్రజల తీర్పును అంగీకరించకుండా దేశాన్ని అస్థిరపరిచే విధ్వంసకర మార్గాన్ని ఎంచుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల అండదండలతో అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వం ఉన్న శక్తులు దేశ భద్రతను, సార్వ¿ౌమత్వాన్ని సవాల్‌ చేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి కుట్రలను ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొడుతుందని నితిన్‌ నబీన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement