breaking news
law and order
-
కీలక జిల్లా... ఎన్నాళ్లిలా..?
పల్నాడు జిల్లాలో ఎస్పీని కూడా నియమించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. చిలకలూరిపేట, సత్తెనపల్లిలో వెలసిన పేకాట క్లబ్.. పెదకూరపాడులోనూ షో తిప్పేందుకు సిద్ధమవుతోంది. నెత్తుటి కత్తి నడివీధిలో చిందులేస్తూ రౌడీరాజ్యాన్ని తలపిస్తోంది. పట్టపగలే పగిలిన ఇళ్ల తాళాలు.. భద్రతను గాలిలో దీపంలా మారుస్తున్నాయి. మైనింగ్ వాహనాలు అడ్డదారుల్లో దూసుకెళ్తున్నాయి. బాస్ లేక అత్యధిక భాగం పోలీసు స్టేషన్లలో న్యాయం గుమ్మం వద్దే నిలిచిపోతోంది. సివిల్ పంచాయితీలు, అక్రమ కేసుల దందా చట్టం కళ్లకు అవినీతి గంతలు కడుతోంది. అన్యాయాలు, అక్రమాలు, అభాగ్యుల ఆక్రందనలతో జిల్లా విలవిల్లాడుతోంది.సాక్షి, నరసరావుపేట: శాంతిభద్రతల దృష్ట్యా ఎంతో కీలకమైన పల్నాడు జిల్లాకు పోలీస్‌బాస్ లేక పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రజల బాగోగుల కోసం నియామకానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి బిందుమాధవ్, మల్లికా గార్గ్, కంచి శ్రీనివాసరావులు పనిచేసి బదిలీపై వెళ్లగా, తాజాగా విధులు నిర్వహించిన బి. కృష్ణారావు ఇప్పటికే రాష్ట్ర సరీ్వసు నుంచి కేంద్ర సరీ్వసులోకి వెళ్లి సీబీఐలో సేవలు అందిస్తున్నారు. ఆయన బదిలీపై వెళ్లి నెల రోజులవుతున్నా, నేటికీ ఆయన స్థానంలో కొత్త ఎస్పీని ప్రభుత్వం నియమించలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లు, అక్రమాలకు వత్తాసు పలకాలన్న ప్రచారం నేపథ్యంలో కొందరు అధికారులు పల్నాడు జిల్లాకు ఎస్పీగా రావడానికి వెనుకాడుతున్నారని ప్రచారం నడుస్తోంది. అత్యంత సమస్యాత్మక జిల్లా అయిన పల్నాడులో ఎస్పీ కుర్చీ ఖాళీగా ఉండటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. కొంతకాలంగా పల్నాడు జిల్లా పోలీసు వ్యవస్థ గాడితప్పింది. ముఖ్యంగా సివిల్ పంచాయితీలతో విసిగిన బాధితులు పోలీసు స్టేషన్ల వద్ద ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలు పోలీసు వ్యవస్థ పనితీరుకు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, సానుభూతిపరులపై అక్రమ కేసులతో వేధించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. ఐదో ఎస్పీ ఎవరో...?సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎస్పీగా పనిచేస్తున్న బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ముందే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో 2024 మే 18న మల్లికాగార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ముక్కుసూటి అధికారిణిగా పేరున్న మల్లికాగార్గ్‌ను కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారని ప్రచారం నడిచింది. అదే ఏడాది జూలై 13 వరకు, అంటే ఆమె కేవలం రెండు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఆమె స్థానంలో కొత్త ఎస్పీగా పల్నాడు జిల్లాకు కంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో జిల్లాలో రాజకీయ హత్యలు జరిగాయి. వీటి దర్యాప్తులో అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు సమాచారం. కేవలం 14 నెలలు మాత్రమే విధులు నిర్వహించిన అనంతరం ఆయన బదిలీపై వెళ్లిపోయారు. 2025 సెపె్టంబర్ 14న బి. కృష్ణారావును ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆయన కేంద్ర సరీ్వసులకు వెళ్లడానికి కారణాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో చట్టానికి విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేక వెళ్లారని సమాచారం. ఎస్పీ చాంబర్లోకి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వెళ్లి గడియ పెట్టుకొని రోజంతా హైడ్రామా నడిపిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైతేనేం, పట్టుమని పది నెలలు కూడా పనిచేయకుండానే నిజాయతీ గల అధికారి జిల్లాను వదిలి వెళ్లడం విచారకరమని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరు వస్తున్నారంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా ఏర్పడినప్పటి నుంచి తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్‌రెడ్డి రెండేళ్లకుపైగా సమర్థంగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చే ఎస్పీ అయినా రవిశంకర్‌రెడ్డిలా ఎక్కువకాలం పనిచేస్తే జిల్లాపై పూర్తి అవగాహన వచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి వీలు పడుతుందని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అనుకూల అధికారి కోసం ప్రయత్నాలు? సత్తెనపల్లిలో గత కొంతకాలంగా అధికార పార్టీ నేతల అండదండలతో పేకాట క్లబ్ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నిత్యం వందల మంది పేకాట రాయుళ్లు జిల్లాతోపాటు గుంటూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నారు. సత్తెనపల్లి క్లబ్ దెబ్బకు చిలకలూరిపేట, గుంటూరు క్లబ్‌లకు సైతం తాకిడి తగ్గిందని సమాచారం. నిత్యం భారీ మొత్తంలో ఆర్జిస్తున్న పేకాట నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉండే అధికారికి ఎస్పీ పోస్టింగ్ వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ యువనేత వద్ద ఈ ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది. తమకు అనుకూలంగా అధికారి వస్తే త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న పెదకూరపాడు నియోజకవర్గంలోని పేకాట క్లబ్‌కు సైతం ఇబ్బందులు తలెత్తవని వారి పన్నాగంగా సమాచారం. -
ఏపీ లాకప్‌డెత్‌లపై లోక్‌సభలో చర్చకు నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్ డెత్‌ల అంశాలను లేవనెత్తేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చారు.ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్ వంటి కేసులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న కొన్ని లాకప్ డెత్ ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వ్యవహారశైలి, కస్టడీలో ఉన్న వ్యక్తుల రక్షణ, న్యాయ ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై పార్లమెంట్లో చర్చ అవసరమని ఎంపీలు భావిస్తున్నారు. ఏపీ శాంతిభద్రతల అంశంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ అనుమతిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే గనుక జరిగితే.. కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చతో లోక్‌సభ హీటెక్కే అవకాశాలు ఉన్నాయి. -
దొంగను పట్టుకున్నాం సార్! అయితే స్టేషన్లో దింపేసి వెళ్లండి
నెల్లూరు జిల్లా: ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ఒంటి కాలిపై పరుగులెత్తే పోలీసులు శాంతిభద్రలను కాపాడడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రజల ఆస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగను పట్టుకుని పోలీసులకు ఫోన్ చేసి ‘దొంగను పట్టుకున్నాం.. తీసుకెళ్లండి’ అంటే.. సారీ.. మా స్టేషన్లో సిబ్బంది లేరు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండి అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటన గూడూరు పట్టణంలో బుధవారం వేకువ జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ నడి»ొడ్డులోని చర్చి కాంపౌండ్‌లో ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా యజమానికి మెలుకువ వచ్చి అతన్ని పట్టుకుని నిలదీస్తే అతను గంజాయి మత్తులో ఉన్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసాల్లోని వారు చేరుకుని అతని నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో మాట్లాడుతూ హల్చల్ చేయడంతో స్థానికులు 100కు డయల్ చేశారు.కంట్రోల్ రూమ్ నుంచి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు అరగంట తరువాత ఫోన్ చేసి ఏమి జరిగిందనే విషయం అడిగి తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నాం, మీరు వచ్చి తీసుకుని వెళ్లండని పోలీసులకు తెలియజేస్తే స్టేషన్లో సిబ్బంది లేరు, అందరూ బందోబస్తుకు వెళ్లి ఉన్నారు. కాబట్టి మీరే అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండని చెప్పారు. దీంతో అపరిచిత వ్యక్తిని చర్చి కాంపౌండ్ వాసులు బజారులో వదలి వేశారు. ఇలా అపరిచితులు ఇష్టానుసారంగా పట్టణంలో సంచరిస్తుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు బిహార్ కన్నా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఏకమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వాటిని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.’ అని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో ‘కూటమి పాలనలో శాంతిభద్రతలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని కూటమి నేతల అరాచకాలు, దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు పెట్టి ప్రజలకు వివరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే అరాచకాలు రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, రిటైర్డ్ ఏఎస్పీ జల్లా రాజేశ్వరరెడ్డి, సామాజిక ఉద్యమకారిణి వసుంధర, న్యాయవాదులు కేవీఎం రజిని, ఒగ్గు గవాస్కర్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి, అధికార ప్రతినిధులు రవికుమార్, బండి పుణ్యశీల తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగుతోంది. కసబ్ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్‌ను కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి ట్రయల్ నిర్వహించి శిక్ష వేశారు. కానీ, విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి దహనం చేశారు. మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానని స్పష్టంగా సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి సాయికృష్ణ లాకప్‌డెత్, పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలి. టీడీపీ, జనసేన నేతలు ఎన్ని దారుణాలు చేసినా కేసులు పెట్టరా? లాయర్ శ్రీనివాస్ ఇంటిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే బాధితుడైన శ్రీనివాస్ పైనే పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. అమరావతిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడినా, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ దళిత ప్రిన్సిపాల్‌ను వేధిస్తే ఈ రోజుకీ కేసు నమోదు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదు. డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసినా కేసు లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీకి కొమ్ముకాసే కీలు»ొమ్మలుగా మారిపోయారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ బతికి ఉంది కాబట్టే దేశంలో సామాన్యుల మనుగడ సాధ్యమవుతోంది.ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారుఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు ఆందోళన తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ (అమరావతి) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లాకు చెందిన ఏపీ జేఏసీలోని వివిధ శాఖల సంఘాల నాయకులు, ఉద్యోగులతో మంగళవారం జరిగిన సమావేశానికి బొప్పరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నేటికీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా నియమించాల్సిన పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదని చెప్పారు. అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకూ ఒకసారి పెరగాల్సిన డీఏలు గత రెండేళ్లుగా పెంచలేదని, అసలు ఆ ప్రకటనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలపైనా ప్రభుత్వం ఎలాంటి చర్చలూ చేయడం లేదని విమర్శించారు. ఉద్యమానికి సిద్ధం: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు దశలవారీ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమాలకు జేఏసీ సమావేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల పదో తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జేఏసీ జిల్లా నాయకత్వాలు ఆర్డీవోలకు, ఎమ్మెల్యేలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం సూచించింది. ఈ నెల 12న శ్రీకాకుళం, 21న అనంతపురం జిల్లాలో సాధారణ ఉద్యోగులను సమాయాత్తం చేసేందుకు ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేస్తున్నామని సమావేశం స్పష్టం చేసింది. త్వరలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ సభలు నిర్వహిస్తామని సమావేశం ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సమావేశంలో రాష్ట్ర మహిళా జేఏసీ చైర్పర్సన్ పారె లక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి, రాష్ట్ర జేఏసీ నాయకుడు వీఎస్ దివాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోకా ప్రకాష్‌తో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, డివిజన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంకా డీఏ, ఐఆర్ ఇవ్వలేదని, ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల సరెండర్ లీవులు ఇవ్వాల్సి ఉన్నా వాటి విషయం చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాకినాడలోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యల సాధనకోసం సాగించే పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొనాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. -
తమిళనాడు సీఎం విజయ్ సంచలన ఆదేశం
సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పాలనా శైలితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ జోక్యానికి తావులేకుండా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నేరస్తులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు సహా రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విజయ్ రెండు రోజుల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. నామక్కల్ కవింజర్ మాళిగైలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, వ్యవస్థీకృత నేరాల అణచివేతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులను ఉద్దేశించి విజయ్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి శక్తిమంతులైనా, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా నిష్పాక్షికంగా చట్టప్రకారం శిక్షించాలి. అమాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదు అని అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని సూచించారు.మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, పోక్సో కేసుల విచారణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, విద్యార్థులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో నిఘా పెంచి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు.రాష్ట్రాన్ని 'డ్రగ్స్-ఫ్రీ తమిళనాడు'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయ్ ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేరాలపై రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, వాటి మూలాలను గుర్తించి ముందస్తుగా అడ్డుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.రౌడీషీటర్లు, బెయిల్‌పై బయట ఉన్న నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజయ్ ఆదేశించారు. సైబర్ నేరాలు, కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేలా యంత్రాంగం పనిచేయాలని పేర్కొన్నారు. భూ వివాదాలు హింసాత్మక ఘటనలకు దారితీయకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. తాగునీరు, వైద్యం, విద్య, విద్యుత్, ప్రజా రవాణా వంటి మౌలిక సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో తొలి రోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. రెండో రోజు జిల్లాల అభివృద్ధి పనులపై కలెక్టర్లతో, అనంతరం పోలీసు అధికారులతో సీఎం విజయ్ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశాల ముగింపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కలెక్టర్లు, పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులను సీఎం విజయ్ స్వయంగా సత్కరించి పురస్కారాలు అందజేయనున్నారు.అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలన, శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై సీఎం విజయ్ తీసుకుంటున్న కఠిన వైఖరి తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన పాలనా శైలి ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. -
ఆంధ్రప్రదేశ్‌లో భీతావహ పాలన... పోలీసులంటేనే ప్రజలు భయపడిపోతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
-
‘యోగి’ మార్క్ రూల్స్: నమాజ్‌లు, బలులు బ్యాన్
లక్నో: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పది కీలక ఆదేశాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలుముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీచేసిన ఆదేశాల ప్రకారం, ఈద్-ఉల్-అధా సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ నిర్వహించకూడదు. రోడ్లను దిగ్బంధించి ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఒకవేళ నమాజ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, వారు మసీదుల లోపల లేదా ఈద్గాల వద్ద షిఫ్టుల వారీగా ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మతపరమైన ప్రక్రియలు చేయకూడదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.జంతు బలులపై కఠిన నిబంధనలుపండుగ సందర్భంగా జంతు బలుల విషయంలో ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి జంతు బలులు నిర్వహించకూడదని, కేవలం నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, నిషేధిత జంతువుల వధను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పండుగ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా, తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.నిఘా, భద్రతా చర్యలురాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. డ్రోన్లు, సిసిటివి కెమెరాల ద్వారా ప్రతి కదలికను అధికారులు పర్యవేక్షిస్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాత ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేలా స్థానిక శాంతి కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. -
పిల్లలూ... చదవాలి లా
ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్ నొక్కాడు. బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్ ఫొటో పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్ రేస్ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే. కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్ ఐపిఎస్ వీరేందర్. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.‘ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్’ అని చట్టంలో మొదటి పాఠం. ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తప్పులు... శిక్షలునేటి పిల్లల ప్రపంచం స్క్రీన్ అంత చిన్నది... లేదా స్క్రీన్ అంత పెద్దది. స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్ లేకపోతే, మైనర్ డ్రైవింగ్ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.బడిలో చట్టం నేర్పిస్తే?‘లీగల్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ సి.బి.ఎస్.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్ హక్కులు ఏంటి, సైబర్ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్ ఉంటే కేవలం 29 స్కూల్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ‘దీనివల్ల కెరీర్ ఏముంది’ అని స్కూల్స్ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, పోలీస్ అధికారులు వారానికి ఒక పీరియడ్ తీసుకుంటే చాలు.కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్ బడిలో చాక్‌పీస్ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి. ‘రోడ్డు నాదే’ అని బైక్ నడిపేవాడు ‘రూల్ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్ టీజింగ్’ కాదు, ‘క్రిమినల్ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.అతని కృషిఢిల్లీ రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ వీరేందర్ పుంజ్ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్ అయ్యాక స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు. పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్ స్టడీస్ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్ అండ్ రన్ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది. ఒక్క పిరియడ్ చాలుచట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్. రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్ స్టడీస్’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా. – కె. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తా
ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్‌ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్‌ను నిర్మిస్తాం’’అని అన్నారు.4 రోజుల్లో ప్రమాణస్వీకారంప్రధానిగా తారిఖ్‌తో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్పీ నేత మొహమ్మద్ షాహబుద్దీన్ చెప్పారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్(బంగభవన్)లో తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుర్ రషీద్ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్పీ సీనియర్ నేత ఒకరు అన్నారు. భారత్‌తో బంధంపై.. తారిఖ్ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్‌తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం. వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం!భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్ హసీనా కాలంలో భారత్–బంగ్లాదేశ్ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది. -
ప్రమాదంలో కేరళ భద్రత
తిరువనంతపురం: కేరళలో శాంతి భద్రత పైకి సాధారణంగా కన్పిస్తున్నా లోపల అనేక ముప్పులు క్రమేపీ పెరుగుతున్నాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భవిష్యత్తులో ఇవి ప్రమాదకరంగా మారనున్నాయని హెచ్చరించారు. మలయాళ పత్రిక కేరళ కౌముది ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘పీఎఫ్ఐ, జమాతె ఇస్లామీ, ఎస్డీపీఐ వంటి రాజకీయ పార్టీలు కేరళను సురక్షితంగా ఉండనిస్తాయా? ఇటువంటి బెడదలను ముందుగానే గుర్తించి, తొలగించడం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని’ అని అన్నారు. పీఎఫ్ఐ కేడర్ మొత్తాన్నీ కటకటాల్లోకి నెట్టేసి, దేశాన్ని తాము సురక్షితంగా ఉంచామని చెప్పారు. తెరవెనుక ఉన్న ముప్పులను తొలగించినప్పుడే కేరళ సురక్షితంగా ఉండగలదని అమిత్ షా అన్నారు. బీజేపీ వల్లనే అది సాధ్యమని చెప్పారు. పద్మనాభుని సన్నిధిలో పూజలుకేరళలో ఒక్క రోజు పర్యటనకు గాను శనివారం రాత్రి తిరువనంతపురం చేరుకున్న అమిత్ షా ఆదివారం ఉదయమే అనంత పద్మనాభుని ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ ధోవతి, సిల్కు శాలువాతో వచ్చిన అమిత్ షాకు ట్రావెన్కోర్ రాచ కుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమిత్ షాకు ఆలయ అధికారులు పద్మనాభస్వామికి అంకితమిచ్చే సంప్రదాయ విల్లును బహూకరించారు. . కేరళ, బెంగాల్‌లలో ఒకేసారి ఎన్నికలుఅనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా నూతనంగా ఎన్నికైన తిరువనంతపురం బీజేపీ కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేరళలోనూ ఎన్నికలు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలో బంగారు తరుగు కేసుపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అసలైన దోషులను కాపాడేందుకు అధికార ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆలయ ఆస్తులనే కాపాడలేని వారు ప్రజల విశ్వాసాలను ఎలా పరిరక్షించగలరంటూ ప్రశ్నించారు. -
వరంగల్‌లో మూగబోయిన పోలీస్ సైరన్
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాబు, పవన్, లోకేశ్ జిల్లాల్లో పెరిగిన దాడులు, హత్యలు
-
ఆయుధం లేకుండానే యుద్ధానికి!
సాక్షి, హైదరాబాద్: సరిహద్దులో సైనికులంతా అస్త్రశస్త్రాలతో కదన రంగంలోకి దూకి శత్రువులపై పోరాడుతుంటే సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం అసాంఘిక శక్తులు, ముష్కరులతో ఉత్త చేతులతోనే పోరాడాల్సి వస్తోంది. ఈ కారణంగానే తాజాగా నిజామాబాద్‌లో ఘరానా దొంగ రషీద్‌ను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు కత్తితో పొడవడంతో అమరుడయ్యాడు. గతంలోనూ పలువురు కానిస్టేబుళ్లు ఆయుధాలేవీ లేకుండానే నేరస్తులతోపాటు ఉగ్రవాదులకూ ఎదురెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నెత్తురోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు... రాష్ట్ర నిఘా విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసిన కుక్కుడపు శ్రీనివాసులు 2017లో ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పతకాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశవ్యాప్తంగా 25 ఉగ్రవాద కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆలంజెబ్ అఫ్రిదీని శ్రీనివాసులు 2016 జనవరిలో పట్టుకున్నారు. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అఫ్రిదీ కదలికల్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరులోని పరప్పణ అగ్రహార ప్రాంతంలో గుర్తించారు.దీంతో పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ శ్రీనివాసులుపై అఫ్రిదీ, అతని భార్య కత్తితో దాడి చేశారు. పేగులు బయటకు వచ్చి నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా శ్రీనివాసులు స్థానిక పోలీసులు వచ్చే వరకు అఫ్రిదీని ఒడిసిపట్టుకున్నారు. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు శౌర్యచక్ర అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా పోలీసు విభాగంలో పనిచేసే అధికారికి శౌర్యచక్ర పతకం లభించడం అదే తొలిసారి. నేరగాళ్లతో పోరాడిన వాళ్లెందరో... గత మూడేళ్లలో నేరస్తులను పట్టుకొనే క్రమంలో అనేక మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అయినా వెనక్కు తగ్గకుండా నిందితులను పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీలో కానిస్టేబుల్‌గా పనిచేసిన రాజు నాయక్‌కు శౌర్య పతకం లభించింది. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో భార్యాభర్తల్ని చంపి దోపిడీకి పాల్పడిన రౌడీషీటర్ కరణ్‌సింగ్‌ను పట్టుకునే క్రమంలో రాజు ఛాతీలో కత్తి దిగింది. అయినా రాజు తన సహచరులు వచ్చే వరకు కరణ్‌సింగ్‌ను విడిచిపెట్టలేదు. ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.ఈ క్రమంలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎస్ఓటీ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి తొడలోకి తూటా దూసుకుపోయింది. అయినప్పటికీ ఆయన మిగిలిన కానిస్టేబుళ్లతో కలిసి ప్రభాకర్‌ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. మాదాపూర్ సీసీఎస్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేసే యాదయ్య, దినేశ్.. స్నాచర్లు రాహుల్, కిషన్ల కోసం ముమ్మరంగా గాలించారు. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. ఆ సందర్భంలో రాహుల్ కత్తితో దాడి చేయగా యాదయ్యకు ఏకంగా ఏడు కత్తిపోట్లు పడ్డాయి.పోలీసు వద్ద ఆయుధాలు కనుమరుగు... విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి ఆయుధం అనేది శరీరంలో భాగం లాంటిది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం వరకు అధికారులతోపాటు కీలక విభాగాల్లో పని చేసే కానిస్టేబుళ్లు తమ వద్ద తుపాకీ ఉంచుకునే వారు. అయితే కొన్నేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు చేపట్టే పోలీసులెవరూ తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై YS జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం
-
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?2 రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? 3 ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? 4 శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.5 ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. -
కీచకులకు చంద్రబాబు సర్కార్ అండదండలు: కాకుమాను
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికపై లైంగికదాడి జరిగితే, కారకుడైన నిందితుడికి అధికారపార్టీ అండగా నిలవడం దారుణమన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా వారికి రక్షణ కల్పించాలన్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన 12 ఏళ్ల మైనర్ బాలికపై గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన ఆర్.రమేష్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడి చేశాడు. పోలీస్ విచారణలో ఆ బాలికపై నిందితుడు రమేష్ అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో నిందితుడు పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది.ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేసును రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తమ పార్టీకి చెందిన కార్యకర్తను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ఏకంగా బాలిక తండ్రిని బెదిరించి, బలవంతంగా లక్ష రూపాయలకు రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. దీనిలో భాగంగా రూ.20 వేలు కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు. తన నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అంటే తన పార్టీకి చెందిన వారు ఏది చేసినా అది సమంజసమేనని సమర్థిస్తున్నారా?గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆడబిడ్డలపై దాడులు చేసే వారికి అదే వారి ఆఖరి రోజు అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పార్టీ వారే కీచకులుగా మారి మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో జరిగిన ఇటువంటి దారుణాలపై నోరు మెదపడం లేదు.దిశయాప్‌ను నిర్వీర్యం చేశారురాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వ్యవసనాల బారిన పడిన ఆకతాయిలు బాలికలపైనా, మహిళలపైనా దాడులకు తెగబడుతున్నారు. గతంలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశయాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎంతో గొప్పగా శక్తీయాప్ను తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో ప్రతిచోటా మహిళలపై ఈరకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు -
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
మా మాటే పవన్ చెప్పారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్, ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టగలిగారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన పరిణామాలపై అంబటి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కల్యాణ్ అన్నారు. మేం మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారు. పాలన చేతకాక పవన్ ఇలా తప్పించుకుంటున్నారు. ఐదు నెలల తర్వాత పోలీసులు విఫలమయ్యారంటే మీకు పాలన చేతకాదని అర్థం. అసలు అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారు. పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ ఏం చేశారు?. పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్ట్ చేశారు. పైగా ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్సా? అని పవన్‌పై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ముందే అనిత హోం మంత్రి, వెనకాల నారా లోకేష్ అన్ని ట్రాన్స్ఫర్లు చేస్తారు అని ఎద్దేవా చేశారాయన. అలాగే.. గతంలో ఇదే పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. ‘‘ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని వైఎస్సార్సీపీ హయాంలో పవన్ అన్నారు. మరి మిస్సైన వాళ్లలో ఒక్కరి జాడ అయినా కూటమి ప్రభుత్వం కనిపెట్టిందా?’’ అని అంబటి ప్రశ్నించారు. సరస్వతి పవర్ భూములు చట్టం ప్రకారం కొనుగోలు చేసినవి. అలాంటిది మీకు ఏ హక్కు ఉందని అక్కడికి వెళ్లారు. సరస్వతి భూముల వ్యవహారం ఇప్పుడు కొత్తదా? అని పవన్‌ను ప్రశ్నించారు అంబటి. ఇదీ చదవండి: నేరస్తులే అప్డేట్ అయ్యి తప్పించుకుంటున్నారు: హోం మంత్రి అనిత -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
ఉన్మాదంతో దాడులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు ఉన్మాదం, భావోద్వేగంతో మందిరాలు, మజీద్‌లపై దాడులు చేస్తూ.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి సంఘటన సహా ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరా లకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా సమాజానికి చెడు చేసేవారి విషయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎంతో తెలివైనదని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పారు. ‘పోలీస్ అమరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)’సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజల భద్రత కోసం ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం, పోలీసుల ప్రతిష్ట పోతుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలి. ఒకరి దగ్గర చేయిచాచే పరిస్థితి ఉండకూడదు. ఖద్దరు, ఖాకీలను సమాజం నిశితంగా గమనిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా నడుచుకోవాలి..’’ అని సీఎం రేవంత్ సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠినంగా ఉంటాం సరికొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలు, యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బందిని, కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు అమరులపై రాసిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ శిఖాగోయల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరులకు భారీగా ఎక్స్‌గ్రేషియా.. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అమరులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.కోటి.. ఎస్సై, సీఐలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.50 లక్షలు, ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ వరకు రూ.60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని.. ఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు తీవ్రంగా గాయపడితే రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్ రాజీవ్‌రతన్ కుమారుడికి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా, కమాండెంట్ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పోలీస్ అమరుడు ఆది ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమెండో ఆది ప్రవీణ్ కుటుంబాన్ని గోషామహల్ స్టేడియం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆది ప్రవీణ్ భార్య రాథోడ్ లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్లకు పోలీసు స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ఆది ప్రవీణ్ భార్య లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎంకు ధన్యవాదాలు పోలీసు అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం, పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఇన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు: ఆర్కే రోజా
సాక్షి,చిత్తూరుజిల్లా: ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబునాయుడు రియాల్టీ షోకు వెళ్లాడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత రోజా విమర్శించారు. ఆదివారం(అక్టోబర్ 20) రోజా మీడియాతో మాట్లాడారు.‘ రాష్ట్రంలో బాలికలు, మహిళలపైన హత్యలు,అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాడోగాని ఆడపిల్లలను నరికి,తగలబెట్టి చంపుతున్నారు.చిన్నపిల్లలు, పెద్దవారు, అత్తా కోడళ్లు అని వావి వరుస లేకుండా మతిస్థిమితం లేని వారని కూడా చూడకుండా నేరస్తులు ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరిగి ఉండవు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం. బాధిత కుటుంబానికి ఏ ఒక్క నాయకుడూ వచ్చి అండగా నిలబడడం లేదు. వీకెండ్ ఎప్పుడు వస్తుందా హైదరాబాద్‌కు ఎప్పుడు వెళదామా ఎంజాయ్ చేద్దామా అన్న ధోరణిలోనే నాయకులున్నారు’అని రోజా ఫైర్ అయ్యారు.ఇదీ చదవండి: కష్టాల్లో ఏపీ ప్రజలు.. వినోదాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు -
అంగళ్లు కేసు క్లోజ్
-
ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టే కుట్రలు
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్‌ని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
హైదరాబాద్ లో రోజుకో హత్య.. అసలేం జరుగుతోంది ?
-
వెనక్కి తగ్గిన చంద్రబాబు
-
లా అండ్ ఆర్డర్ విఫలం..
-
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు, దాడులు సంభవించే అవకాశాలున్నాయన్న సమచారంతో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్– సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా నిర్వహిస్తోంది. పట్టణాలు, గ్రామాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు బలగాలు సోదాలు చేస్తున్నాయి.అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మద్యం మొదలైనవాటికి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాల్లేని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 276 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 24 కేసులు నమోదు చేశారు. 10మందిని అరెస్ట్ చేయడంతో పాటు 8 మందికి సీఆర్పీసీ 41ఏ నోటీసులిచ్చారు. 2 వేల లీటర్ల నాటుసారా, 27.50 లీటర్ల అక్రమ మద్యం, 6,910 లీటర్ల అక్రమ బీరుతో పాటు అక్రమంగా నిల్వ చేసిన 4 వేల లీటర్ల డీజిల్, 25 లీటర్ల పెట్రోల్‌ను జప్తు చేశారు. -
పోలీసులు మామూళ్లు అడగడం లేదు


