
శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండండి
డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్‌ని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.