సీజేపీ నిరసన హింస వెనుక  భారీ కుట్ర కోణం | Delhi police file new FIR to see if 20 July 2026 violence | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసన హింస వెనుక  భారీ కుట్ర కోణం

Oct 9 2026 6:21 AM | Updated on Oct 9 2026 6:21 AM

Delhi police file new FIR to see if 20 July 2026 violence

తాజాగా ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) జూలై 20వ తేదీన చేపట్టిన నిరసన సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక భారీ కుట్రకోణం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచి తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. హింసను కొందరు ప్రేరేపించినట్లుగా భావిస్తున్న పోలీసులు, ఇది ముందస్తు కుట్రా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

జంతర్‌మంతర్‌ వేదికగా సీజేపీ మరోసారి నిరసనకు ప్రయత్నిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ 10న చేపట్టిన ఆందోళనకు అనుమతివ్వలేదని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పరిధిలో నమోదైన 17 ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రద్దు చేశారు. అయితే, నేర చరిత్ర కలిగిన 2,873 మందిపై నమోదు చేసిన కేసులను దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు పోలీసులకు అనుమతిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement