మావిగన్‌పై ఆగని టీడీపీ డైవర్షన్‌ కుట్రలు | Tdp Diversionary Conspiracy On Mavigun | Sakshi
Sakshi News home page

మావిగన్‌పై ఆగని టీడీపీ డైవర్షన్‌ కుట్రలు

Apr 9 2026 6:55 PM | Updated on Apr 9 2026 7:27 PM

Tdp Diversionary Conspiracy On Mavigun

సాక్షి, అమరావతి: మావిగన్‌పై తెలుగుదేశం పార్టీ డైవర్షన్‌ కుట్రలకు తెరలేపింది. ప్రజలు పాజిటివ్‌గా చర్చిస్తుంటే అధికార పక్షం ఓర్వలేకపోతోంది. ఎలాగైనా మావిగన్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర తీసింది. వైఎస్‌ జగన్‌.. మావిగన్‌ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే సైకో అంటూ టీడీపీ నేత పట్టాభి చిందులు తొక్కారు. జగన్‌ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. వైఎస్సార్‌సీపీ నేతల భార్యల గురించి పచ్చపత్రిక అధినేత ఆర్కే రాతరోతలు రాశారు.

ఇలా.. రోజుకో డైవర్షన్‌ స్కీంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని తిడుతూ మావిగన్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ కుట్రలు తెరతీసింది. ఇప్పుడు వైఎస్సార్‌ మరణంపై అచ్చెన్నాయుడు నీచపు మాటలు మాట్లాడుతూ.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై అభాండాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. మహానేత కుమారుడిపై అభాండాలను తట్టుకోలేక బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొత్స.. భావోద్వేగానికి గురయ్యారు.

అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలపై బొత్స మండిపడ్డారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్సార్‌ ఒకరని.. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నానని బొత్స అన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement