‘హనీమూన్‌’ కేసు: బిగ్‌ ట్విస్ట్‌.. సంజయ్‌వర్మ మరెవరో కాదు.. | Who is Sanjay Verma whom Sonam Raghuvanshi Called 119 Times | Sakshi
Sakshi News home page

‘హనీమూన్‌’ కేసు: బిగ్‌ ట్విస్ట్‌.. సంజయ్‌వర్మ మరెవరో కాదు..

Jun 19 2025 11:25 AM | Updated on Jun 19 2025 12:31 PM

Who is Sanjay Verma whom Sonam Raghuvanshi Called 119 Times

మీరట్‌: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లు వివాహమయ్యాక హనీమూన్‌ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు.  కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్‌ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్‌ ప్రియుడు రాజ్‌ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్‌కు సంజయ్ వర్మతోనూ సంబంధం  ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్‌ వర్మ మరెవరో కాదని, సోనమ్‌ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్‌ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్‌ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్‌ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్  నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.  



ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్‌ విద్యార్థుల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement