‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్‌ విద్యార్థుల ఆగ్రహం | Students Evacuated From Iran Find Buses in bad Condition to Travel to JK | Sakshi
Sakshi News home page

‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్‌ విద్యార్థుల ఆగ్రహం

Jun 19 2025 10:08 AM | Updated on Jun 19 2025 10:22 AM

Students Evacuated From Iran Find Buses in bad Condition to Travel to JK

న్యూఢిల్లీ: ఇరాన్‌లో ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్న వేళ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న విద్యార్థులను భారత్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలి దఫాలో ఈరోజు(గురువారం) ఉదయం 110 మంది విద్యార్తులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి తమ ప్రాంతానికి వెళ్లేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అందించిన బస్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం  స్పందించింది. విద్యార్థులకు డీలక్స్ బస్సులు పంపేలా జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన 110 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి చేరుకుంది.  ఈ సందర్బంగా ఆ విద్యార్థులలో ఒకరైన అలీ మీడియాతో మాట్లాడుతూ ఇది తమకు ఎంతో కష్టమైన ప్రయాణమని, టెహ్రాన్‌లో అధికంగా దాడులు జరిగాయన్నారు. 

భారత రాయబార కార్యాలయ అధికారులు తాము తొలుత అర్మేనియా సరిహద్దును దాటడానికి సహాయం చేశారని, అక్కడ తాము ఒక రోజు బస చేసిన తరువాత  ఢిల్లీకి వచ్చామని తెలిపారు. కశ్మీర్ నివాసి షేక్ అఫ్సా మాట్లాడుతూ, తాము ఎంతగానో అలసిపోయామని, ఈ డొక్కు బస్సుల్లో తమ ఇళ్లకు వెళ్లడం ఎంతో కష్టమన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సమసిపోవాలని కోరుకుంటున్నామని, ఇవి తమ చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమకు త్వరలో ప్రాక్టికల్ తరగతులు ఉన్నాయని, తాము  ఇరాన్‌  తిరిగి వెళ్లవలసి ఉంటుందన్నారు. 

ఇది కూడా చదవండి: ‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్‌ సైన్యాధ్యక్షునికి ట్రంప్‌ కితాబు

Advertisement
 
Advertisement
Advertisement