కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు బిగ్‌ షాక్‌ | Kerala High Court Orders FIR Against Pinarayi Vijayan In CMRL Financial Dealings Case, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు బిగ్‌ షాక్‌

Oct 9 2026 2:42 PM | Updated on Oct 9 2026 3:04 PM

Kerala High Court Orders Fir Against Pinarayi Vijayan In Corruption Case

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణ, అల్లుడు పి.ఏ. మహమ్మద్ రియాస్‌లపై సీఎంఆర్‌ఎల్‌ ఆర్థిక లావాదేవీల కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ప్రజా ఉద్యమకారుడు, న్యాయవాది కేఎం షాజహాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం ఈ  కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఈడీ  కీలక అంశాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ప్రాథమిక విచారణకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పుతో రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. ప్రైవేట్ మైనింగ్ సంస్థ కోచిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్), టీ వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీ మధ్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక లావాదేవీల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. కొచిన్‌ మినలర్స్‌ అండ్‌ రూటిలె లిమిటెడ్‌ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత, సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేరళ హోం శాఖ తరఫున, క్రైమ్ బ్రాంచ్ ద్వారా ప్రాథమిక విచారణ సరిపోతుందని.. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన చట్టపరమైన అవసరం లేదని వాదించింది. అయితే, ఈ వాదనను హైకోర్టు అంగీకరించలేదు. ఫెడరల్ దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాల తీవ్రత దృష్ట్యా, కేవలం ప్రాథమిక విచారణతో సరిపెట్టకుండా అధికారికంగా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలో కోర్టు రిట్ పిటిషన్‌ను అనుమతించింది.

ఇప్పటివరకు రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో, పినరయి విజయన్, మహమ్మద్ రియాస్‌లను తమ కేసులో నిందితులుగా చేర్చే విషయంలో ఈడీకి విధానపరమైన అడ్డంకులు ఎదురైనట్లు సమాచారం. తాజాగా అవినీతి నిరోధక చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. తదుపరి దర్యాప్తునకు చట్టపరమైన మార్గం సుగమం కానుంది. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తును తిరిగి విస్తరించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: భారత్‌ బాస్‌ అంబానీయేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement