కోల్‌కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్‌ రిపోర్టులో వెల్లడి | Kolkata Case Marks Around Neck Chest | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్‌ రిపోర్టులో వెల్లడి

Jun 29 2025 7:07 AM | Updated on Jun 29 2025 11:56 AM

Kolkata Case Marks Around Neck Chest

కోల్‌కతా: కోల్‌కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై  కమిలిపోయిన గుర్తులను మెడికల్‌ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.

26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి  వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.

ఈ కేసులో కోల్‌కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు  సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్‌తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. 
 


ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్‌.. దేనికి సంకేతం?

Advertisement
 
Advertisement
Advertisement