breaking news
Kolkata girl
-
కోల్‌కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్‌కతా: కోల్‌కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్‌కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్‌తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం? -
దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలంటూ దీదీ సర్కార్ పిటిషన్
-
సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన సీల్దా కోర్టు
-
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారు
-
మమతా బెనర్జీ చివరి ప్రయత్నం
-
నార్కో టెస్టుకు కోర్టు సంచలన తీర్పు
-
మమత బెనర్జీ నివాసం ముట్టడి
-
సుప్రీం సీరియస్
-
వైద్య సిబ్బందిపై పీక్స్ కు చేరిన వేధింపులు..
-
వైద్య సిబ్బందికి నోటీసులు
-
కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
అమ్మకోసం..ప్రధానికి లేఖ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలందరూ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకే కాక, ఇటు వైద్య ఖర్చులకు నగదు పుట్టడం లేదు. దీంతో ఆవేదన చెందిన కోల్‌కత్తాకు చెందిన ఓ అమ్మాయి డైరెక్ట్‌గా ప్రధాని నరేంద్రమోదీకే లేఖరాసింది. ఆసుపత్రిలో ఉన్న తన అమ్మను రక్షించాలంటూ ప్రధానిని అభ్యర్థించింది. ప్రస్తుతం అమ్మ ఐసీయూలో ఉందని, వెంటనే కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉందని లేఖలో పేర్కొంది. నిర్మలా గుప్తా అనే మహిళ కాలేయ దెబ్బతిని గతకొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్స కోసం రూ.30 లక్షలు అవసరం కాగ, తమ దుకాణాన్ని అమ్మాలని ఆ కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ నోట్ల రద్దుతో ఎవరూ దుకాణాన్ని కొనడానికి ముందుకురావడం లేదు. దీంతో ఆ కుటుంబసభ్యులు నిర్మలాగుప్తా చికిత్సకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎలాంటి దారి కనిపించకపోవడంతో ఆమె కూతురు పూజా గుప్తా, నగదు సహాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖరాసింది. ‘‘ప్రధాన్ మంత్రిజీ, మా అమ్మ ఐసీయూలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేయాల్సినవసరం ఉంది. మాకు ఎంత తిరిగినా నగదు దొరకడం లేదు. ఇప్పటివరకు మేము దాచిపెట్టిన సొమ్మూ అమ్మ చికిత్సకు సరిపోవడం లేదు. బ్యాంకులో కూడా నగదు కోసం మేము అప్లయ్ చేసుకున్నాం. కానీ నగదు జారీకావడానికి 20 నుంచి 30 రోజులు సమయం పడుతుందని బ్యాంకు వారు చెప్పారు. మాకున్న ఒక్కానొక్క దుకాణాన్ని అమ్మకానికి పెట్టాం. కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ఎవరూ ఆ షాపును కొనడానికి ముందుకురావడం లేదు. మాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. దయచేసి మా అమ్మ ఆపరేషన్‌కు సహాయం చేయగలరు’’ అని పేర్కొంటూ ఆ అమ్మాయి ప్రధానికి లేఖ రాసింది.