
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్‌గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్‌కట్‌లు డైట్‌లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.
34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్‌గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్‌గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె.
తాను ఎలాంటి క్రాష్ డైట్‌లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్‌లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది.
ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్‌ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది.
ఇవి మంచివేనా అంటే..
కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్‌అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట.
ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..)