ఆహ్లాదం కోసం అమృతాసనం | Health Benefits of Corpse Pose Shavasana | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం కోసం అమృతాసనం

Mar 19 2026 9:35 AM | Updated on Mar 19 2026 12:57 PM

Health Benefits of Corpse Pose Shavasana

మనసుకు, శరీరానికి విశ్రాంతి, శాంతిని ఇచ్చే అమృతాసన లేదా శవాసన. అమృతాసన లేదా సాధారణంగా శవాసన అని పిలిచే ఈ యోగాసనం యోగ సాధనలో అత్యంత ముఖ్యమైనది. “శవం” లా పూర్తిగా నిశ్చలంగా పడుకుని చేసే ఈ ఆసనం శరీరానికి విశ్రాంతి ఇచ్చే సాధన మాత్రమే కాదు - ఇది మనసును లోతుగా ప్రశాంతపరిచే ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే దీనిని "అమృతాసన" అని కూడా అంటారు -అమృతం లాంటి పునరుజ్జీవనం ఇస్తుంది.

చేసే విధానం...

స్టెప్-1 సమతల ప్రదేశంలో యోగా మ్యాట్ మీద వెల్లకిలా (వెనుక భాగం నేలకు ఆనించి)ని టారుగా పడుకోండి.

స్టెప్-2 కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచి, పాదా లను బయట వైపునకు ఉండేలా పెట్టాలి.

చేతులను శరీరానికి కొద్దిగా దూరంగా, అరచే తులు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి.

స్టెప్-3  మెడ, తల నిటా రుగా ఉంచి, కళ్లను మృదువుగా మూసుకుని, ముఖ కండరా లను పూర్తిగా సడలించాలి.

ఇప్పుడు శ్వాసను గమనించండి - లోపలికి వచ్చే శ్వాస, బయటకు వెళ్లే శ్వాసపై దృష్టి నిల పాలి.

స్టెప్-4 తల నుంచి పాదాల వరకు ప్రతి భాగాన్ని మానసికంగా సడలిస్తూ, ఒత్తిడిని, ఆలోచ నలను విడిచిపెట్టాలి.

స్టెప్-5 కనీసం 7-15 నిమిషాలు ఈ స్థితిలో ఉండాలి.

ముగించేటప్పుడు కుడివైపు మెల్లగా తిరిగి, ఎడమ చేతి సాయంతో నెమ్మదిగా కూర్చోవాలి.

ప్రయోజనాలు:

⇒ యోగసాధనలో చేసిన అన్ని ఆసనాల తర్వాత ఈ ఆసనం శరీర కండరా లకు సంపూర్ణ విశ్రాంతి ఇస్తుంది హృదయ స్పందనలు సరిగ్గా ఉండటానికి, బీపీ తగ్గడానికి సహాయపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ తగ్గడా నికి ఎంతో ఉపయోగపడుతుంది నిద్రలేమి

⇒ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది

 శవాసనను రోజూ చేస్తే నిద్ర గాఢంగా వస్తుంది నర్వస్ సిస్ట మను సమతుల్యం చేసి, మెదడుకు శాంతి కలిగి స్తుంది

గర్భిణులు - మెనోపాజ్ మహిళలకు సహకరిస్తుంది. శరీర హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది.

జాగ్రత్తలు:  నిద్రపోకూడదు - ఇది ధ్యాన

⇒ స్థితి వెన్నునొప్పి ఉన్నవారు మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకోవచ్చు గర్భిణులు ఎడమ పక్కగా పడుకోవాలి చల్లటి గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. 
కనీసం 7 నిమిషాలు చేయాలి.

పాతర్ల అనిత, యోగా ట్రైనర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement