
ఇటీవలే థగ్ లైఫ్ మూవీలో కనిపించిన కోలీవుడ్ హీరో శింబు మరో కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమయ్యాడు. వెట్రి మారన్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మరింత యవ్వనంగా కనిపించేందుకు శింబు బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన పది రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు అయితే ఈ సినిమా గతంలో వెట్రి మారన్, ధనుశ్ కాంబోలో వచ్చిన చిత్రం వడ చెన్నై మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం లేదని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో కవిన్, మణికందన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధనుశ్ చిత్రం 'వడ చెన్నై'లో నటించిన ఆండ్రియా జెరెమా, సముద్రఖని, కిషోర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.