
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్‌గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.
గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్‌నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్‌లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె.
అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె.
శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు.
ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్‌లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్‌నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత.
(చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?)