
హీరోయిన్లు తమ గ్లామర్, లుక్స్ మెంటైన్ చేసినన్నీ రోజులు బాగానే ఉంటుంది. కానీ కాస్త బరువు పెరిగినా, బొద్దుగా కనిపించినా సరే సోషల్ మీడియాలో ట్రోల్స్ లాంటివి మొదలవుతాయి. రీసెంట్ టైంలో అలా చర్చకు కారణమైన హీరోయిన్ నివేతా థామస్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో బోలెడు సినిమాలు చేసింది. నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ తదితర చిత్రాలు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
(ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)
చివరగా '35-ఇది చిన్న కథ కాదు' అనే తెలుగు మూవీలో కనిపించిన నివేతా.. తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ఈ జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకలో పాల్గొంది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. అయితే ఈ ఈవెంట్‌లో చీరలో నివేతా కనిపించింది. కానీ ఆమె బొద్దగా ఉండటంపై సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. మరీ ట్రోల్స్‌ని సీరియస్‌గా తీసుకుందా ఏమో గానీ ఇప్పుడు కొత్త లుక్‌లో కనిపించింది.
గద్దర్ అవార్డ్ ఈవెంట్ ఫొటోల తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత తాజాగా ఇన్ స్టాలో నివేతా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త బరువు తగ్గినట్లు కనిపిస్తుంది. దీంతో రెండు నెలల్లోనే ఇంత మార్పు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్‌లోని బెస్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కళ్లతోనూ హావభావాలు పలికించగలదు. కాకపోతే ఎన్టీఆర్ తప్పితే స్టార్ హీరోల చిత్రాల్లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరి ఇప్పుడు బరువు తగ్గడంతో మళ్లీ తెలుగులో బిజీగా అవుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్)