దక్షిణ కొరియా పాప్ సంచలనం హ్యూనా (32) మకావులో జరిగిన WATERBOMB 2025 సంగీత ఉత్సవంలో ఉన్నట్టుండి వేదికపైనే కుప్ప కూలిపోవడం సంచలనంగా మారింది. తమ అభిమాన పాప్‌స్టార్ ఆరోగ్యానికి ఏమైందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.K-పాప్ ఇండస్ట్రీలో బాడీ ఇమేజ్, ఆరోగ్యం లాంటి ఒత్తిళ్లపై తీవ్రమైన చర్చకు ఆజ్యం పోసింది. ప్రదర్శన మధ్యలోకుప్పకూలిపోవడం అభిమానులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
హ్యూనాకు ఏమైంది?
ఆదివారం (నవంబర్ 9) హ్యూనా WATERBOMB 2025 మకావు బహిరంగ మ్యూజిక్ ఫెస్టివల్‌లో హ్యునా హిట్ పాట బబుల్ అద్భుతంగా సాగుతోంది. ఫ్యాన్స్ అంత ఆమె సంగీతంలో ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతలో ఆమె వేదికపై కుప్పకూలిపోయింది. దీంతో తోటి కళాకారులంతా పరిగెత్తుకు వచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
బరువు తగ్గడమే కారణమా?
అయితే ఇటీవల తాను డైటింగ్ ద్వారా బాగా బరువు తగ్గినట్టు వెల్లడించింది హ్యునా. వివాహం తర్వాత తాను స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నానని, కేవలం 30 రోజుల్లోనే 10 కిలోగ్రాములు (22 పౌండ్లు) తగ్గినట్లు తెలిపింది. ఇంత తక్కువ కాలంలో అంత వెయిట్‌లాసా అని అటు అభిమానులు, ఇటు ఆరోగ్య నిపుణులను షాక్‌కు గురిచేసింది. కొన్ని వారాలకే సంఘటన జరగడం వారికి మరింత షాకిచ్చింది.
#HyunA fainted in the middle of her performance at Waterbomb in Macau. She later posted an apology to the fans who had come from far away and paid to see her, but an unexpected incident occurred. Here’s her apology post:
> “I’m truly sorry. I wanted to show my best, but I feel… pic.twitter.com/X7TH75hXZ8— 하엘뉴스! (@hlxnews) November 9, 2025
హ్యూనా స్పందన
తరువాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించింది హ్యునా. తన ఫ్యాన్స్‌ను కంగారుపెట్టినందుకు క్షమాపణలు చెప్పింది. ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నానని,తన బలాన్ని తిరిగి పొందడంపై దృష్టి సారిస్తున్నానని హామీ ఇచ్చింది. తన షోస్‌కు చిన్న విరామమని కూడా తెలిపింది.

నెటిజనుల ఆందోళన
తాజా పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు సోషల్ మీడియాను ఆందోళన వ్యక్తం చేశారు. షోస్‌కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ గాయనిపై ప్రేమను కురిపించారు.కె-పాప్ స్టార్స్‌కు, పరిశ్రమకు మేల్కొలుపు లాంటిదని సూచించారు.
ఎవరీ హ్యునా
K-పాప్ ఇండస్ట్రీలో పేరున్న కళాకారిణి. గత ఏడాది తోటి గాయకుడు యోంగ్ జున్‌హ్యుంగ్‌ని పెళ్లాడింది.ఇటీవల కాస్త బరువు పెరగడంతో ప్రెగ్నెంట్ అనూ పుకార్లు వ్యాపించాయి. దీంతో సోషల్‌మీడియాద్వారా తన బరువుకు కారణాలపై వివరణ ఇచ్చింది. పెళ్లి తరువాత బాగా తింటున్నానని, అందుకే వెయిట్ పెరిగానని బహిరంగంగా అంగీకరించింది.
అదే పోస్ట్‌లో డైట్ చేసిన మళ్లీ సన్నగా మారాలనే ప్లాన్స్ కూడా చెప్పుకొచ్చింది. తాను సన్నగా ఉన్నప్పటికీ ఫోటోలు షేర చేసిన మళ్లీ ఇలా అయిపోవాలనే కోరికను వ్యక్తం చేసింది. కేవలం 30 రోజుల్లోనే 10 కిలోగ్రాముల బరువు తగ్గినట్లు వెల్లడించింది. కాగా హ్యూనా చాలా కాలంగా వాసోవాగల్ సింకోప్‌తో పోరాడుతోంది. ఇది శరీరం ఒత్తిడికి గురైనప్పుడు లేదా అలసటకు గురైనప్పుడు మూర్ఛపోవడం. వేగంగా బరువు తగ్గడం, ఒత్తిడితో కూడుకున్న లైవ్ షోస్ దీనికి దారి తీసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


