
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..
ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్, బీట్‌రూట్, చికెన్, ఓట్స్ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్‌నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు.
అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్‌బెల్ సెషన్ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్‌ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్ ఫోకస్ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.
(చదవండి: అరుదైన స్ట్రోక్‌తో..మెడుల్లాపై దాడి!)