
బరువు తగ్గించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని పలువురు నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో చాలామంది బరువుతగ్గే ప్రయత్నానికి పూనుకుంటున్నారు కూడా. అయితే ఈ మహిళ మాత్రం తన అధిక బరువుని తగ్గించుకోవడమే ఆమెకు వరంగా మారింది. జస్ట్ 90 రోజుల్లో మధుమేహ సమస్యకు చెక్‌పెట్టి ఔరా అనిపించుకుంది. మరి ఇంతకీ ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.
40 ఏళ్ల నార్మా లియోన్స్‌కు, అధిక బరువుతో ఉండటంతో ఆమె రూపు రేఖలన్నీ బొద్దుగా ఉండేవి. దీంతో అధిక ఒత్తిడికి గురై డయాబెటిస్ బారిన పడింది. తరుచుగా తన ఆహార్యాన్ని చూసుకుని కుంగిపోతూ ఉండేది. దాంతో ఆమె ఈ దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం కోసం బరువు తగ్గాల్సిందే అని ఫిక్స్ అయ్యింది.
ముగ్గురు పిల్లల తల్లి అయిన నార్మాలియోన్స్‌కు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల నడుమ తనపై ఫోకస్ పెట్టడం కుదురేది కాదు. ఆ నిర్లక్ష్యంగా కారణంగానే నార్మాలియోన్స్ అధిక బరువు సమస్యలను ఎదుర్కొందామె. దాంతో ఆమె తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టి బరువు తగ్గాలని పట్టుదలతో ప్రయత్నించింది.
అలా ఆ తల్లి కేవలం 90 రోజుల్లో..డైట్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తన బరువులో గణనీయమైన మార్పలను అందుకుంది నార్మాలియోన్స్. ఫలితంగాఆ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చేశాయి. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే డయాబెటిస్ నుంచి బయటపడింది నార్మాలియోస్. దాదాపు రెండు దశాబ్దల తర్వాత ..ఆ 60 ఏళ్ల తల్లి జస్ట్ ఆహారం, ఆరోగ్యంలో మార్పులు చేసుకోడంతో గణనీయమైన బరువు తగ్గి, తన అనారోగ్యాన్ని స్వయంగా నయం చేసుకుంది.
ప్రీ డయాబెటిస్ అంటే..
ఇక్కడ నార్మా ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతోంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితి. కానీ టైప్2 డయాబెటిస్‌ని నిర్థారించినట్లుగా..దీన్ని ముందుగా గుర్తించడం అంత ఈజీ కాదు
ఈ ప్రీడయాబెటిస్‌ని ఆహారం, వ్యాయమాలు, చక్కటి జీవనశైలి తరితదరాలతో నిర్వహించడమే గాక తిప్పికొట్టొచ్చు. వైద్యులు ఆమెకు ఈ షుగర్ వ్యాధి కోసం నోటి ద్వారా తీసుకునే మెట్‌ఫార్మిన్ ఇచ్చినప్పటికీ..ఆమె వాటిని వేసుకునేందుకు తిరస్కరించింది. ఇలా చేయొద్దని వైద్యులు హెచ్చరించారు కూడా. చివరికి ఆమె మెడిసిన్ వాడనని మొండిపట్టుపట్టడంతో సరే నీ అదృష్టం అని వైద్యులు వదిలేశారు.
అందుకోసం ఏం చేసిందంట..
నార్మా లియోన్స్ చాలా అధ్యయనం చేసి కీటో డైట్ అనుసరించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లును దరిచేరనీయకుండా కేర్ తీసుకుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకునేది. ప్రతిరోజూ ఉదయం గుడ్లు, బేకన్, చీజ్, చికెన్ సలాడ్, లీన్ మాంసం తదితరాలను తీసుకున్నట్లు వివరించింది. ఈ కఠినమై డైట్‌తో నార్మాలియోన్స్ కేవలం మూడు నెలల్లో పది కిలోలు తగ్గి..రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చేసింది.
ప్రస్తుతం ఆమె ప్రీ డయాబెటిక్ పేషెంట్ కాదని వెల్లడించారు వైద్యులు. పట్టుదలతో బరువు తగ్గింది అనారోగ్యం నుంచి కూడా బయటపడింది. ఇక్కడ కావాల్సింది ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే చాలు ఎలాంటి వ్యాధినైనా తిప్పికొట్టచ్చు అనేందుకు నార్మాలియోన్స్ వెయిట్‌లాస్ స్టోరీనే ఉదాహారణ.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్‌నెస్ కోచ్)