
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్‌మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్‌నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్‌గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్‌గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్‌క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్‌క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.
వెయిట్‌లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం.
ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్‌జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్‌జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్‌లాస్ కోసం చాట్‌జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె.
ఇన్‌స్టా పోస్ట్‌లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్‌క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్‌ని ఎంచుకోండి. అందుకోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.
చాట్‌జీపీటీలో ఎలా అడగాలంటే..
చాట్‌జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది.
ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్‌లో రాసుకొచ్చింది సిమ్రాన్.
గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..)