
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్‌గా యంగ్ విమెన్‌లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్‌నెస్‌లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ.
ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్‌లో జిమ్‌లో రకరకాల మిషన్‌లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది.
అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది.
చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు.
పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్‌నెస్‌లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Pregnant Women: బీకేర్‌ఫుల్.. మార్నింగ్ సిక్‌నెస్‌ని లైట్ తీసుకోవద్దు!)