
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ కాస్త నలతగా ఉండటం అనేది సహజం. పైగా చాలామందికి మార్నింగ్ సిక్‌నెస్ ఉంటుంది. ప్రతి ఉదయం మూడ్ స్వింగ్స్ మారుతూ ఒక విధమైన అలసటగా ఉంటుంది. వైద్యులు, పెద్దవాళ్లు కూడా ఈ సమయంలో ఇది అత్యంత సహజం అని చెబుతుంటారు. అలా అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతంకంగా మారిపోయి క్రిటికల్‌గా పరిణమిస్తుంది. అచ్చం అలానే జరిగింది ఈ బ్రిటన్‌కు చెందిన ఈ మహిళకు. పాపం ఆ కారణంగా ఆమె అమ్మ అను భాగ్యాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన 29 ఏళ్ల సోఫియా యాసిన్ పెళ్లైన రెండు సంవత్సరాలకు గర్భం దాల్చింది. ఆ విషయ తెలుసుకున్నప్పటి నుంచి ఆ దంపతులిద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రతి ఉదయం అలసిపోతూ, నీరసంగా ఉండేది. అదే విషయం వైద్యులకు తెలిపినా..ఇది కామన్ అని సర్ది చెప్పారు. ఇది రాను రాను మరింత ఎక్కువ అవుతుందే గానీ తగ్గేది కాదు.
ఆఖరికి రాత్రుళ్లు, చెమటలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్ఫన్నమయ్యేవి. ఆ తర్వాత 14 వారాల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ ఉన్నట్టుండి హఠాత్తు కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. బహశా ఆమెకు న్యూమోనియా ఉందేమోనని భావించారు వైద్యులు. అయితే పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు గుండెపై కణితి ఉందని, నాన్-హాడ్కిన్‌కు సంబంధించిన ప్రాణంతక బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వివరించారు.
ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. ఏం చేయాలో తెలియని దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతేగాదు గర్భాన్ని కూడా కొనసాగించడం సాధ్యం కాదని, ఒకవేళ కొనసాగించినా..ఆ చిన్నారి కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో ఆ దంపతులు ఒక్కరోజుతో తమ సంతోషమంతా దుఃఖంగా మారిపోయిందని భోరుమని విలపించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో 15 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుని ఆరు రౌండ్ల కీమోథెరపీ ట్రీటెమంట్‌లు తీసుకుంది సోఫియా. ఈ ఏడాది ప్రారంభంలో సోఫియా పూర్తిగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యవంతురాలైంది. అంతేగాదు తనలా మరెవ్వరూ బాధపడకూడదని, లింఫోమా(బ్లడ్ కేన్సర్ చెంది)తో పోరాడి గెలిచేలా నిధులు సేకరిస్తోందామె.
నాన్-హాడ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?
నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన కేన్సర్. ఇది అవయవాలు, గ్రంథులు, ట్యూబ్ లాంటి నాళాలు, శోషరస నోడ్స్ వంటి కణాల సముహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమైన జెర్మ్-ఫైటింగ్ కణాలు శరీరం అంతటా నియంత్రణ లేకుండా పెరిగి, కణితులనే ఏర్పరిస్తే..దాన్నినాన్-హాడ్కిన్ లింఫోమాగా నిర్థారిస్తారు వైద్యులు.
సంకేతాలు-లక్షణాలు..
మెడ, చంకలు లేదా గజ్జల్లో వాపు శోషరస గ్రంథులు
బొడ్డు నొప్పి లేదా వాపు
ఛాతీ నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చాలా అలసటగా అనిపించడం
జ్వరం
రాత్రిపూట చెమటలు పట్టడం
ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామటుకు దీన్ని అంత సులభంగా గుర్తించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పైన చెప్పిన మార్పుల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటే..తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: