జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్‌ గ్లో కోసం..! | After Massive Weight Loss Dont Forget These Facial Exercises, List Of Best Foods For Weight Loss | Sakshi
Sakshi News home page

జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్‌ గ్లో కోసం..!

Jun 21 2025 11:26 AM | Updated on Jun 21 2025 1:04 PM

After Massive weight loss dont forget these facial exercises

తీవ్రమైన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గడం అంటే శిఖరాన్ని అధిరోహించేందుకు చేసే కసరత్తులా అనిపిస్తుంది. ముఖ్యంగా బిజీ జీవనశైలిలో అధికబరువుపై ధ్యాస, జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం పెద్ద యుద్ధమే అనిపిస్తుంది.  పోషకాహార నిపుణురాలు ఉదిత అగర్వాల్‌ జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ముఖంలోని కొవ్వును సహజంగా తగ్గించడంలో సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలనూ, తీసుకోదగిన ఆహారాలను మన ముందుంచింది.

  • తీసుకునే ఆహారంలో మొత్తం కొవ్వుపై దృష్టి పెట్టాలి. ఎన్ని కేలరీలు ఉన్నాయో, దానికంటే అదనపు కేలరీలను బర్న్‌ చేయాలని గుర్తించాలి. అప్పుడు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు. 

  • ఉత్తమ ఫలితాల కోసం ఆరోగ్యకరమైన ఆహారం + క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రెండూ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. 

  • సమతుల ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్‌ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. 

  • అధిక ప్రొటీన్‌ తీసుకోవడం ద్వారా కొవ్వు తగ్గుతుంది. కడుపు నిండుగా ఉంటుంది.

  • ఆరోగ్యకరమైన కొవ్వులు మొలకెత్తిన గింజలు, విత్తనాలలో ఉంటాయి.

  • నీళ్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు – కూరగాయలను తీసుకోవాలి. 

  • రోజూ కనీసం 2–3 లీటర్ల నీళ్లు తాగాలి. 

  • ఒత్తిడిని తగ్గించడం – హాయిగా నిద్రపోవడం ఒత్తిడి కార్టిసాల్‌ను పెంచుతుంది, ఇది కొవ్వు పేరుకుని పోయేలా చేస్తుంది. 

  • ప్రతి రాత్రి 7 నుంచి 9  గంటల సేపు నిద్ర΄ోయేలా చూసుకోండి. నిద్ర సరిగా లేక΄ోవడం వల్ల శరీరం నీరు పట్టినట్టుగా కనిపిస్తుంది. 

ముఖ వ్యాయామాలు – టోనింగ్‌ 

  • ఈ వ్యాయామాలు చర్మం నునుపును మెరుగుపరుస్తాయి

  • బుగ్గలు ఉబ్బినట్టుగా ఉంటే, మునివేళ్లతో మృదువుగా వెనక్కి మర్దనా చేయాలి. 

  • పళ్ళు బిగించి, నవ్వుతూ, 10 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. 

  • ‘ఫిష్‌ ఫేస్‌‘ ప్రయత్నించాలి. అంటే, బుగ్గలను లోపలికి పీల్చుకొని, కొన్ని సెకన్లపాటు ఉంచాలి. 

చక్కెర పానీయాలకు దూరం
మద్యం చర్మాన్ని డీహైడ్రేట్‌ చేస్తుంది. నీటిని చేరుస్తుంది. చక్కెర పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి ఒంట్లో ఎక్కువ కొవ్వు నిల్వలను చేరుస్తాయి.  పై జాగ్రత్తలన్నీ తీసుకొని, బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాను. డైటీషియన్‌ కోర్సు కూడా పూర్తిచేశాను. నాపై నేను తీసుకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ నన్ను నాజూగ్గా మార్చింది. 

బరువు తగ్గడానికి 12 రకాల ఆహార పదార్థాలు 
కూరగాయలు (కేలరీలు చాలా తక్కువ)
1. దోసకాయ – 100 గ్రాములకు16 కిలో కేలరీలు లభిస్తాయి. హైడ్రేటింగ్, క్రంచీ, సలాడ్స్, స్నాక్స్‌ చేయడానికి సరైనది.
2. గుమ్మడికాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు తేలికైనది, చాలా రకాలు చేయవచ్చు. 
3. లెట్యూస్‌– 100 గ్రాములకు 15 కిలో కేలరీలు
ర్యాప్‌లకు, సలాడ్‌ బేస్‌గా అనువైనది.
4. పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలు
ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది, స్మూతీలు, సాగ్‌ లేదా సాటీయింగ్‌కు సరైనది.
5. కాలీఫ్లవర్‌ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలు
అన్నం, పిజ్జా క్రస్ట్‌ లేదా సబ్జీలలో ఉపయోగించవచ్చు. పండ్లు (సహజంగా తీపి – తక్కువ 
కేలరీలు)
6. పుచ్చకాయ – 100 గ్రాములకు 30 కిలో కేలరీలు వేడి వాతావరణం ఉన్నప్పడు మరీ మంచిది. 
7. స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు – 32 కిలో కేలరీలు తీపి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, జీర్ణక్రియకు మంచిది.
8. బొప్పాయి – 100 గ్రాములకు 43 కిలో కేలరీలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా కడుపు నిండుగా ఉంటుంది. 
9. ఉడికించిన గుడ్డులోని తెల్లసొన – గుడ్డులోని తెల్లసొనకు – 17 కిలో కేలరీల స్వచ్ఛమైన ప్రొటీన్, కొవ్వు ఉండదు. కండరాల నిర్వహణకు సరైనది.
10. వెన్నలేని పెరుగు (తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 59 కిలో కేలరీలు ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది, జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది.
11. టోఫు (లైట్‌ లేదా తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 70 కిలో కేలరీలు మొక్కల ఆధారిత ్ర΄ోటీన్, మృదువైనది మరియు సంతృప్తికరంగా ఉంటుంది.
12. ఎయిర్‌ -పాప్డ్‌ పాప్‌కార్న్‌ (ఉప్పు, వెన్న లేనిది) – కప్పుకు 30 కిలో 
కేలరీలు. 
తాను ఇవన్నీ ఫాలో అయాను కాబట్టే బరువు తగ్గినా ముఖం కళ తప్పకుండా కాపాడుకోగలిగాను అని చెబుతోంది ఉదితా అగర్వాల్‌.

 

 ‘‘నా చిన్నతనం నుంచీ అధికబరువు సమస్యను ఎదుర్కొన్నాను. ఆరోగ్య సమస్యల బారిన పడ్డాను. జుట్టు రాలి΄ోయేది, ముఖంపై యాక్నె ఉండేది.  పాతికేళ్లు వచ్చేసరికి వంద కేజీలకు పైగా బరువు పెరిగాను. జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకున్నాను. ఎనిమిది నెలల్లో 30 కేజీల బరువు తగ్గాను. కానీ, మేని చర్మం సాగినట్టు, ముఖంలోని కొవ్వునూ కోల్పోయి, సన్నబడి, కళ తగ్గినట్టుగా అనిపించింది. ఈ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడ్డాను.  -ఉదితా అగర్వాల్‌.

 

 

Advertisement
 
Advertisement
Advertisement