230 -110 కిలోలకు అద్నాన్‌ సామి :‘ఆపరేషన్‌కాదు,వాక్యూమ్‌ క్లీనర్’ | No operat Adnan Sami shares how he lost 120 kgs | Sakshi
Sakshi News home page

230 -110 కిలోలకు అద్నాన్‌ సామి :‘ఆపరేషన్‌కాదు,వాక్యూమ్‌ క్లీనర్’

Jun 9 2025 3:49 PM | Updated on Jun 9 2025 3:54 PM

No operat Adnan Sami shares how he lost 120 kgs

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్‌ సామి భారీకాయంతో ఉండేవాడు. అలాంటిది ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గి.. అంటే   ఫిట్‌ అండ్‌ స్మార్ట్‌ లుక్‌లో కనిపించాడు.   230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గిపోయాడు. కఠోర శ్రమ, ఆహార నియమాలతో  ఏకంగా 120 కిలోల బరువు తగ్గి,  అద్భుతమైన లుక్‌లో అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే అంత బరువును   ఆయన ఎలా తగ్గించకోగలిగాడు. ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాడు. ఆపరేషన్‌ లాంటిదేమైనా చేయించుకున్నాడా?  పదండి ఆ వివరాలు తెలుసుకుందాం


విలక్షణ స్వరం, పాటలతో సంగీతాభిమానులను ఆకర్షించిన గాయకుడు అద్నాన్‌ సామి.  అద్నాన్ సామి అనూహ్యంగా బరువు తగ్గడం నిజంగా హాట్‌టాపిక్‌. 230 కిలోలున్న వ్యక్తి 120 కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. మిరాకిల్‌ ఎలా జరిగిందీ, తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇటీవల పంచుకున్నాడు.   బారియాట్రిక్ సర్జరీ ,లైపోసక్షన్ లాంటి ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోకుండా ఈ బరువు తగ్గడం విశేషం.జూన్ 1 నాటి   ‘ఆప్ కి అదాలత్ ఎపిసోడ్‌లో   స్వయంగా   తన అద్భుతమైన  వెయిట్‌ లాస్‌, ఫిట్‌నెస్‌  సీక్రెట్స్‌ను పంచుకున్నారు.

120 కిలోల వెయిట్‌ లాస్‌ 
మంచి జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ఈ ఫీట్‌ సాధించారు.230 భారీ కాయం నుంచి  ప్రస్తుతం ఆయన వెయిట్‌  110 కిలోలకు చేరింది. అయితే బరువు తగ్గడానికి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నారా అని షోలో అడిగినప్పుడు, అద్నాన్ ఏమన్నారంటే.. "చాలా ఊహాగానాలు ఉన్నాయి, కొంతమంది నేను బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నానని, మరికొందరు లైపోసక్షన్ అని అన్నారు. అయితే విషయం ఏంటంటే.. లైపోసక్షన్ అనేది సూదితో నిర్దిష్ట ప్రాంతాల నుండి కొవ్వును తొలగించే ప్రక్రియ, సాధారణంగా స్పాట్ రిడక్షన్ కోసం."   “నా బరువు 230 కిలోలు. నా విషయంలో,  కొవ్వు మొత్తాన్ని తొలగించడానికి నాకు వాక్యూమ్ క్లీనర్  అవసరం ఏర్పడింది!” అని  చలోక్తి విసిరారు. 
 

అదే  పెద్ద ప్రేరణ
హ్యూస్టన్‌లోని న్యూట్రిషనిస్ట్  సలహా మేరకు అధికప్రోటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకున్నారు. సుగర్‌, ఆయిల్‌, రైస్‌, బ్రెడ్‌, మద్యానికి పూర్తిగా ఉన్నారు.కఠినమైన ఆహారం, వ్యాయామంతో ఒక నెలలోనే 20 కిలోల బరువు తగ్గడంతో పట్టుదల మరింత పెరిగింది. ఒక్క నెలలో 20 కిలోలు తగ్గడం నిజంగా సంతోషాన్నిచ్చిందని తెలిపారు.  ఒకసారి షాపింగ్‌ సందర్బంగా  XL లో టీ-షర్టు చాలా బాగా నచ్చిందట. కానీ అప్పటిక  ఆయన 9XL. దీంతో నిరాశ చెందాడు. అంతేకాదు ఆషర్టులో నీచేయి కూడా పట్టదు అని తల్లి అన్నారట. అంతే ఆ క్షణమే బరువుగా తగ్గాలని నిర్ణయించు కున్నా.. అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కొంచెం బరువు తగ్గినప్పుడల్లా , అదే షర్టును వేసుకోవడం, రెండుమూడుస్లార్లు చూసుకోవడం ఇదే పని. అలాఒక రోజు,  సరిగ్గా సరిపోయినపుడు.  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాన్నకు ఫోన్ చేసి మరీ ఆనందంతో ఎగిరి గంతేశాను అని  గుర్తు చేసుకున్నారు. 

ఆరు నెలల్లో చనిపోతావ్‌ అన్నా పెద్దగా పట్టించుకోలేదు
బరువు తగ్గాలనుకుంటున్న సమయంలో అద్నామ్‌ తండ్రికి. ప్రాంకియాటిక్ కేన్సర్‌ సోకింది. ఈ సందర్భంగా హాస్పిటల్ వెళ్తే  ఇంత బరువు ప్రమాదకరం, ఇలానే కొనసాగితే ఆరు నెలలో చనిపోతావ్‌ అని ఒక వైద్యుడు అద్నాన్‌ను హెచ్చరించారట.  అయినా పెట్టించుకోలేదు. పైగా బేకరీకి వెళ్లి ఫుల్‌గా లాగించేశడట. ఇది చూసి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి  ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ ఆవేదనతో కన్నీటితో చేసిన  అభ్యర్థన, లైఫ్‌స్టైల్‌ మార్చుకోమని  చేసిన హెచ్చరిక  అతనిలో  పట్టుదల పెంచింది.  చివరికి అనుకున్నది సాధించారు. అలాగే తిరిగి బరువు పెరగకుండా ఉండటానికి కఠినమైన దినచర్యను పాటిస్తున్నానని  చెప్పారు. కష్టపడి బరువు తగ్గాను.. జీవితంలో షార్ట్‌కట్‌లు ఏమీ ఉండవు అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement