
బరువు తగ్గడం పెద్ద టాస్క్. షార్ట్‌కట్‌లో, చిటికె వేసినట్టు బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒక వేళ తగ్గినా అది ఆరోగ్యకరం కాదు కూడా. ఇదే విషయాన్ని బెంగళూరుకు మహిళా డాక్టర్ నిరూపించారు. నో మ్యాజిక్, నో టిప్స్.. నో ట్రెండింగ్ ఫ్యాషన్ అంటూ ఇద్దరు కుమార్తెల తల్లి భావన బరువు తగ్గిన తీరు విశేషంగా నిలుస్తోంది.
బెంగళూరు డాక్టర్ భావన ఆనంద్ నెమ్మదిగా, స్థిరమైన . ఆచరణాత్మక విధానాన్ని స్వీకరించారు. ప్రతి భోజనంలో ఒక ముఖ్యమైన పోషకాన్ని తినడం ద్వారా మూడు సంవత్సరాలలో 30 కిలోల బరువు తగ్గారు.
మూడేళ్లలో 30 కిలోలు ఎలా?
2022 డిసెంబరులో భావన బరువు దాదాపు 84 కిలోలు ఉండేవారు. తాను అనుసరించిన పద్ధతి ద్వారా క్రమంగా 2025 నాటికి 56.6 కిలోలకు చేరుకున్నారు. ప్రతిరోజూ తనను తాను చెక్ చేసుకోవడం, సరిగ్గా తినడం ,క్రమం తప్పని వ్యాయామం ఈ మూడు అలవాట్లు తన జీవితాన్ని మార్చాయి అంటే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. భావన బరువు తగ్గడాన్ని జీవనశైలి మార్పుగా భావించింది.సుదీర్ఘ ప్రణాళికతో క్రాష్ డైట్స్ లేదా డిటాక్స్ లాంటివేవీలేకుండా ప్రతీరోజు చిన్నగా నడవండిఅంటారామె. బరువు తగ్గడం అనేది దానిని తగ్గించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదే.కానీ దృష్టి దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఇది సాధ్యమే అనేది భావన సక్సెస్‌మంత్ర.
గేమ్-ఛేంజర్: భావన ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ జోడించడమే పెద్ద మార్పు.ఈ ఒక్క అడుగు ఆమె ఫిట్‌నెస్ ప్రయాణానికి వెన్నెముకగా మారింది. "కండరాల బలానికి, పెరుగుదలకు భోజనాన్ని సమతుల్యంగా ఉంచడానికి చాలా కీలకం అని ఆమె పేర్కొంది. ప్రోటీన్ ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించింది, భోజనం మధ్య చిరుతిండి లేదా అతిగా తినాలనే కోరికను తగ్గించింది.
ప్రోటీన్ ఎందుకు?
బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించే ఎవరికైనా ప్రోటీన్ అవసరమని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు.కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు శరీరంలోని మూడు ప్రధాన మాక్రో న్యూట్రియెంట్లలో ఒకటిది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీల ఇన్‌టేక్‌ను తగ్గిస్తుంది.
ఎంత ప్రోటీన్ తినాలి? ప్రపంచ ఆహార మార్గదర్శకాల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, పురుషులు కనీసం 56 గ్రాములు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వారి ఫిట్‌నెస్ లక్ష్యాలను బట్టి అధిక మొత్తంలో ప్రయోజనం పొందవచ్చు.
ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలు
గుడ్లు, చికెన్, చేపలు , లీన్ మాంసాలు, కాయధాన్యాలు , చిక్కుళ్ళు
గ్రీకు యోగర్ట్ పనీర్, గింజలు , విత్తనాలు
ప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్లు (అవసరమైనప్పుడు)
తన వెయిట్‌లాస్ జర్నీ, తన ఫిట్‌నెస్ రొటీన్, పలు రకాల కసరత్తుల వీడియోలు, తన ప్రొటీన్ ఆహారం డా. ఫిట్‌మమ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను ప్రేరేపించడం భావనకు అలవాటు.