ఓవైపు బరువు.. మరోవైపు మోకాళ్ల నొప్పి.. అయినా సరే | Actress Ritika Singh On Weight Loss Journey | Sakshi
Sakshi News home page

Ritika Singh: హీరోయిన్ వెయిట్ లాస్ జర్నీ.. వీడియో వైరల్

May 4 2025 9:29 PM | Updated on May 4 2025 9:29 PM

Actress Ritika Singh On Weight Loss Journey

హీరోయిన్లు తమ గ్లామర్ ఎ‍ప్పటికీ కాపాడుకుంటూనే అవకాశాలు వస్తుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించి, నోటికొచ్చింది తిన్నా, జిమ్ చేయకపోయినా బరువు పెరిగిపోతారు. ఇప్పుడు అలానే బరువు పెరిగిపోయిన ఓ టాలీవుడ్ హీరోయిన్.. తన వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

స్వతహాగా కిక్ బాక్సర్ అయిన రితికా సింగ్.. 'సాలా ఖాదుస్' తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఈ మూవీనే తెలుగులో వెంకటేశ్ 'గురు'గా రీమేక్ చేశారు. గత కొన్నాళ్లలో తమిళంలోనే వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఈ మధ్యనే ఎందుకో బరువు పెరిగింది. సరిగ్గా మూడు నెలల్లో మళ్లీ తగ్గిచూపించింది. ఈ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు  

'గత  మూడు నెలల‍్ని అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పటివరకు లేనంతగా బరువు పెరిగాను. మరోవైపు మోకాళ్ల గాయం పరిస్థితి దారుణంగా తయారైంది. నొప్పి తట్టుకోలేకపోయాను. కదల్లేకపోయాను. డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. దీంతో నన్ను నేను ఓసారి అద్దంలో చూసి.. ఇక చాలు అని నాతో నేనే చెప్పుకొన్నా.'

'ఇక ఫుడ్ తో నా రిలేషన్ షిప్ విషయానికొస్తే ఇ‍ప్పుడు చాలా చెడు అలవాట్లని నా కంట్రోల్ లో పెట్టుకున్నాను. దీనికోసం చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను' అని రితికా సింగ్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!  

Advertisement
 
Advertisement
Advertisement