
వెయిట్ లిఫ్టింగ్ అనగానే..మగవాళ్లు చేసేది అనే భావనే అందిరిలో ఉంటుంది. అయితే ఇటీవల కొందరు ఫిట్‌నెస్ ఔత్సాహిక మహిళలు ఆ మూసధోరణిని బద్ధలు కొట్టి మరి వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటారు. చాలామంది ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు సైతం ఈ వెయిట్‌లిఫ్టింగ్‌లు మహిళలకు సరిపడవని, మగవాళ్ల ఫిజిక్‌లా కనిపించేలా చేస్తుందని చెప్పేవారు. అయితే ఆ అపోహను అబద్ధం అని కొట్టిపారేసేలా ఈ మహిళ అద్భుతం చేసి చూపింది. అంతేగాదు మహిళలకు ఈ వెయిట్‌లిఫ్టింగ్ ఎంత మేలు చేస్తుందో సవివరంగా వెల్లడించారామె. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన సుష్మా పచౌరి ఖాడియా కంటెంట్ క్రియేటర్, ఫిట్‌నెస్ కోచ్. ఆమె ఒకప్పుడు స్వతహాగా 93 కిలోలు బరువు ఉండేది. వెయిట్‌లిప్టింగ్‌తో సుమారు 43 కిలోల మేర తగ్గి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతలా సంతరించుకున్న తన శరీర మార్పు గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారామె.
ప్రజలంతా అనుకున్నట్లు వెయిట్‌లిఫ్టింగ్‌లు ఆడవాళ్లను మగవాళ్లలా రఫ్‌గా మార్చదని, ఎంతో ప్రయోజనకరమైనదని అంటోంది. ఇది మహిళల్లోని ఫ్యాట్‌ని కరిగించి వెయిట్‌లాస్‌కు చెక్ పెడుతుందని చెబుతోంది. తాను శుభ్రంగా ఇంట్లో వండిన ఆహారం, క్రమ తప్పకుండా వ్యాయామాలు చేసి ఇంతలా బరువు తగ్గానని చెప్పుకొచ్చింది.
సుష్మా పోస్ట్‌లో 'వెయిట్‌లిఫ్టింగ్ దుష్ప్రభావాలు' అనే క్యాప్షన్ జోడించి చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 18 ఏళ్ల వ్యక్తికి తల్లి అయిని సుష్మా పచైరి వెయిట్‌లిఫ్టింగ్‌ని తన దినచర్యలో భాగం చేసుకున్న తర్వాత నుంచి తన జీవితం ఇంతలా మారిందని తెలిపింది.
సంతరించే మార్పులు-ప్రయోజనాలు..
ఆకాశాన్ని అంటేలా శక్తి స్థాయిలు పెరుగుతాయి.
స్లిమ్‌గా మారుతున్నట్లు తెలుస్తుంది.
దుస్తుల సరిపోతాయి
అందరి అటెన్షన్ మీపై ఉంటుంది. ఎలా బరువు తగ్గారు అని కచ్చితంగా ప్రశ్నించడం మొదలవుతుంది.
సోమరితనం దరి చేరదు
ఒత్తిడి అనే మాటకు ఆస్కారం ఉండదు
కిరాణ సామాగ్రి వంటి పలు రకాల లగేజ్‌లను సులభంగా ఎత్తేయగలుగుతారు
మంచి నిద్ర పడుతుంది.
ఇలాంటి మంచి ఫలితాల కోసం ఫిట్‌నెస్‌కోచ్ సూచించే సలహాలను తప్పక పాటించాలని చెబుతోంది. ఇక్కడ ఈ వెయిట్ లిఫ్టింగ్ మహిళల్లో లీన్ కండరాలను అభివృద్ధి చేయడానికి, శరీరాన్ని పెద్ద పరిమాణంలో కనిపించకుండా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిజానికి ఇది మహిళలకు బలం, ఫిట్‌నెస్ తోపాటు మంచి ఆత్మవిశ్వాసాన్నికూడా అందిస్తుందని నమ్మకంగా చెబుతోంది ఫిట్‌నెస్ కోచ్ సుష్మా పచౌరి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..)