
బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలంటే అంతఈజీ కాదు కూడా. కానీ పోషకాహార నిపుణురాలు(Nutritionist) ఆ భారమైన అధిక బరువుని జస్ట్ నాలుగు నెలల్లో మాయం చేసింది. అంత త్వరిగతిన బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుందామె. ఎంతో బాధకరమైన త్యాగాలు చేయడం వల్ల వెయిట్‌లాస్ జర్నీ విజయవంతమైందని అంటోంది.భారాన్ని తగ్గించుకోవాలంటే బాధను కలిగించే ఇష్టమైన వాటన్నింటిని తృణప్రాయంగా వదులుకోవాల్సిందేనని అంటోంది. మరి అవేంటో చూద్దామా..
పోషకాహార నిపుణురాలు అమాకా(Amaka) బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడూ మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానంటోంది. అమ్మో మన వల్ల కాదు అనిపించింది. ఎందుకంటే కచ్చితమైన మంచి ఫలితాలు త్వరితగతిన రావాలంటే కష్టసాధ్యమైన ఆ పదింటిని చాలా స్ట్రాంగ్‌గా వదులుకోవాలి.
దాంతో తనకు నరకంలా అనిపించిందని, ఆ తర్వాత బరువు తగ్గుతున్న మార్పులను చూసినప్పుడూ విజయం సాధించానన్న ఆనందం ముందు ఇదేమంతా కష్టం కాదనిపించిందని అంటోంది అమాకా. అందువల్లే జస్ట్ నాలుగు నెల్లలో ఏకంగా 25 కిలోలు వరకు తగ్గాగలిగానని అదికూడా ఆరోగ్యకరమైన రీతీలోనే అని చెబుతోంది పోషకాహార నిపుణురాలు అమాకా. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ పది ఇష్టమైనవి ఏంటో చూద్దామా..!.
నో కంఫర్ట్ ఫుడ్స్:
అమాకా మనకు ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలన్నింటిని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని అంటోంది. ఎంత బలంగా జంక్‌కు నో చెప్పగలుగుతాం అంత తొందగా మంచి ఫలితాలు అందకోగలమని చెబుతోంది.
ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్:
వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం ఉదయమేనని చెబుతోంది. అదీకూడా కష్టమైనదే. తెల్లవారుజామున నిద్ర ఎంత మధురంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వదలించుకుని బెడ్‌మీద నుంచి లేగాలంటే కష్టమే అయినా బరువు కోసం త్యాగం చేయక తప్పదని అంటోంది అమాకా.
అడపాదడపా ఉపవాసం:
వారానికి రెండు మూడు రోజులు అడపాదడపా ఉపవాసం బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలా చేయాలంటే ఎంతో కఠినమైన నిబద్ధతోనే సాధ్యమని అంటోంది.
రాత్రుళ్లు పార్టీలు, డిన్నర్‌లకు దూరంగా ఉండటం..
ఫిజీ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి. బయట తినాలనే కోరికను బలంగా నివారించాలి. బయట తింటే మనం అనుసరించే డైట్ ఒక్కసారిగా వృధా అయిపోతుందని హెచ్చరిస్తోంది.
సమయాపాలన..
టైంకి తినేలా చూసుకునేదాన్ని. మరీ ఆకలి వేసేంత వరకు వేచి ఉండకుండా కేర్ తీసుకునేదాన్ని అంటోంది. దాని వల్ల అతిగా తినేస్తామని చెబుతోంది.
మానసికంగా దృఢంగా ఉండటం..
బరువు తగ్గడం అనే ప్రక్రియం కష్టతరమైనది కాబట్టి మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు యోగా వంటి వాటితో ప్రయత్నించాల్సిందే. మనస్సు మన అధీనంలో ఉంటేనే నచ్చినవన్నింటిని తినేయాలనే ఆలోచనను నియంత్రించగలమని చెబుతోంది.
తింటున్న ఫుడ్‌ని ట్రాక్ చేయడం..
ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా..శరీరంలో ఎంత ేమేర ేకేలరీలు, ప్రోటీన్లు తీసుకుంటున్నాం అనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. పైగా అతిగా తినడాన్ని నివారిస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామాలు..
వర్షం, చలి కారణంగా వ్యాయామాలు వద్దు అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలి. ఈ విషయంలో క్రమశిక్షణతో ఉంటే సత్ఫలితాలు త్వరిగతిన పొందగలం అని అమాకా చెబుతోంది.
మార్పులను గమనించడం..
శరీరంలో వస్తున్న మార్పులను గమనించడం. ఒక వేళ్ల అనుకున్నట్లుగా మంచి ఫలితం రాకపోతే నిరాశ పొందడం మానేసి ఇంకేలా సత్ఫలితాలు అందుకోగలం అనే దానిపై దృష్టి సారించాలి.
స్ట్రాంగ్‌గా ఉండటం..
ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడ వీక్ అవ్వకుండా బలంగా ఉండేలా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. స్వీట్స్ తినాలనే కోరికను అదుపులో ఉంచడం, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తదితరాలపై దృఢంగా ఉండాలే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అని చెబుతోంది అమాకా.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్‌రే..)