
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్‌ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు శాస్త్రవేత్తలు. వాట్ డీఎన్‌ఏతో సౌందర్యాన్ని కాపాడుకోవడమా అని ఆశ్చర్యపోకండి. అదెలాగో శాస్త్రవేత్తల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.
అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్‌వాష్‌లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్‌ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్‌ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చట.
దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
డీఎన్‌ఏ డీకోడ్ అంటే..
జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్‌ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.
ఈ డీఓన్‌ఏ డీకోడ్‌తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్‌ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.
(చదవండి: తాగునీరు అంత విలువైనదా..?)