
స్పూర్తిదాయకమైన వెయిట్‌లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్‌తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్‌తో సులభంగా వెయిట్‌లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!
డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్‌లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్‌ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్‌గా మారానని అన్నారామె. తన వెయిట్‌లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్‌గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.
18-10-8-4-1 రూల్ అంటే..
ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్‌ని కూడా క్లియర్‌గా ఉంచుతుంది.
ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.
8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.
4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.
చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది.
అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..
రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు.
16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్
5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం
14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం
18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.
(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..)