
చరిత్రలో దాగున్న కొన్ని ఐకానిక్ దుకాణాలు ఎన్నో విషయాలను వివరిస్తాయి. తరాలు మారుతున్న కొత్తదనంతో తన క్రేజ్‌ని చాటుతూ ఇప్పటకీ కొనసాగుతున్న కొన్ని ప్రసిద్ధ దుకాణాలు మను ముందు దర్శనమిస్తుంటాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దుకాణాన్ని రన్ చేసే తీరు ఉంటేనే ఏళ్ల తరబడి ఒకే వ్యాపారాన్ని చేసేలా నిలబెట్టుకోగలుగుతాం. అందుకు ఉదాహరణే ఇలాంటి ఐకానిక్ దుకాణాలు. అలాంటి ప్రసిద్ధ షాపే ఈ షెర్బత్ దుకాణం. నాటి సమరయోధులకు సమావేశ స్థలంగా, రక్షణ కవచంగా అలరారిన ఈ దుకాణంలో ఎన్నో మధురానుస్మృతులకు కేరాఫ్ అడ్రస్. మరీ ఆ ఆసక్తికర విషయాలు గురించి సవివరంగా చూద్దామా..!.
షెర్బత్కి పర్యాయపదంగా నిలిచిన ఈ దుకాణం కోల్‌కతాలో ఉంది. దీన్ని 1918లో నిహార్ రంజన్ మంజుదర్ స్థాపించారు. స్వతంత్ర భారతదేశానికి పూర్వం నుంచే ఈ ఐకానిక్ దుకాణం ఇంది. శతాబ్దానికి పైగా కస్టమర్ల దాహార్తిని తీరుస్తూ..ఎందరో అభిమానులను సంపాదించుకుంది. సరిగ్గా 1900ల కాలం బ్రిటష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకున్న కీలక సమయం అది.
ఆ సమయంలో ఈ కూడా ఈ చిన్న రెస్టారెంట్ మద్యం దుకాణానికి మించిన కస్టమర్లతో కిటకిటలాడేది. చెప్పాలంటే నాటి స్వతంత్ర సమరయోధుల నిరసనలకు, రహస్య సమావేశాలకు అడ్డగా ఉండేది. అందులోనూ ఈ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు మజుందర్ బెంగాల్ అంతటా పనిచేసే విప్లవాత్మక సముహం అనుశీలన్ అను సమితి బారిసల్ శాఖలో సభ్యుడు కావడంతో సమరవీరులకు ఇది భద్రతా స్థలంగా మారింది.
దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారికి స్నేహహస్తాన్ని అందించి అందర్నీ ఒక్కతాటిపై నడిచేలా చేసిన గొప్ప ప్రదేశంగా కీర్తి గడించింది ఈ దుకాణం. ఇవాళ పాలరాయితో ఆధునిక హంగులతో మరింత సుందరంగా మారిన ఈ రెస్టారెంట్‌లో బల్లలు, బెంచీల స్థానంలో అత్యాధునిక సోఫాలు, టేబుల్స్ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఈ షెర్బత్‌లను దుకాణం యజమాని ఇంట్లో స్వయంగా తయారు చేసి మంచి రుచితో అందించడంతోనే ఎన్ని కొంగొత్త రెస్టారెంట్లు, షాపులు వచ్చినా.. దీని క్రేజ్ తగ్గలేదు.
నాటి విప్లవకారులకు ఈ పానీయం చలదనాన్న అందించి మంచి ఆలోచనలకు పురికొల్పొన అద్భుత పానీయంగా పేరుతెచ్చుకుంది కూడా. ఇక్కడ తాజా కొబ్బరి నీరు, డాబ్ షెర్బత్, కొబ్బరిమలై వంటి రిఫ్రెషింగ్ పానీయాలకు పేరుగాంచింది. ఇక్కడ సీజన్‌లకు అనుగుణంగా షెర్బత్‌లు అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. చలికాలంలో కుంకుమపువ్వు క్రీమ్‌తో కూడిన కేసర్ మలై షెర్బత్‌ని అందిస్తుంది.
ఇది స్వాతంత్ర్య సమరయోధుల తోపాటు, కాలేజ్ స్ట్రీట్ విద్యార్థులు, కవులు, కళాకారులు కలుసుకునే బ్యూటీఫుల్‌స్పాట్‌గా మారింది. ఒకప్పుడు నిరసనలు చర్చలతో వేడిక్కిపోయే ఈ దుకాణం ఇప్పుడు రాజకీయాలు, క్రికెట్, కళలకు సంబంధించిన చర్చలకు కేంద్రంగా మారింది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ.. ఈ షెర్బత్ రుచి, స్ఫూర్తిలలోనూ ఎట్టి మార్పు లేకపోవడమే విశేషం. ముఖ్యంగా నేతాజీబోస్, సౌరవ్ గంగూలీ, సత్యజిత్‌రే వంటి సమరయోధులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడే తమ చర్చలు, సమావేశాలు జరుపుకునేవారని స్థానికులు చెబుతున్నారు.
(చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!)