
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్‌గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.
బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది.
నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్‌గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్‌లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..
ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్‌ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది.
నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట.
స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్‌గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు.
స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.
అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది.
ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి.
వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది.
అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్‌తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమాక.
కాగా, నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్‌ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!)