
పారాగ్లైడింగ్ చేయడమే ఓ సాహస కృత్యం అనుకుంటే..అలా గాల్లో తేలుతూ..మ్యూజిక్ ప్లే చేయాలనుకోవడం అలాంటి ఇలాంటి డేరింగ్ కాదనే చెప్పాలి. అస్సలు ఆ ఆలోచనే వెన్నులో వణుకుపుట్టించేస్తుంది. పారాగ్లైడింగ్‌తో ఒక్కసారిగా గాల్లోకి రాగానే ఎంతటి ధైర్యవంతులైనా..ఒక క్షణం పాటు భయకంపితులు అవ్వడం సాధారణం. అలాంటిది అలా చేస్తూ..లైవ్ మ్యూజిక్ ఇవ్వాలనే కోరిక అంటే..ఇదేం డేరింగ్ ఫీట్ రా బాబు అనిపిస్తుంది కదా..అలాంటి సాహసానికే తెరతేసింది ఇక్కడొక మహిళ..!. ఆమె ఎవరంటే..
డీజే టీఆర్‌వైపీఎస్‌గా పిలిచే ఒక భారతీయ డీజే పారాగ్లైడింగ్ చేస్తూ..సంగీతం ప్లే చేసింది. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మ్యూజిక్ సరంజామా అంతా సురక్షితంగా ప్యాకే చేసుకుని ఎనిమిది వేల అడుగుల ఎత్తుకి వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అక్కడ ఆమె లైవ్‌లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తూ చూడొచ్చు.
నైపుణ్యం కలిగిన పారాగ్లైడింగ్ ట్రైనర్ సైతం ఈ కొత్త అనుభవాన్ని ఉత్సాహంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. నిజం చెప్పాలంటే ఈ సాహస కృత్యంతో ప్రపంచంలోనే తొలి పారాగ్లైడింగ్ డీజే మహిళగా నిలిచింది. పారాగ్లైడింగ్ డీజే సెట్‌ను ఎలా రూపొందించారో కూడా వివరిస్తూ..అక్కడ అంత తీవ్రమైన గాలులు లేవని వెల్లడించిందామె. అయితే పరికరాలు కొంతసేపటికీ పనిచేయకపోవడంతో ఆ ప్రయత్నాన్ని వెంటనే నిలిపేయాల్సి వచ్చిందని వివరించారామె.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అంతర్జాతీయ అంతరిక్షంలో ప్లే చేసిన డీజేగా పేర్కొన్నారు. అంతేగాదు మహిళలు అనుమతి కోసం వేచి ఉండరు. చరిత్ర సృష్టించడమే వారి ధ్యేయం అని వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?)