
వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడడం సహజం. అయితే అందరికీ ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఒంటరి వృద్ధులు ఇతరుల మీద అంతగా ఆధారపడనవసరం లేకుండా 66 సంవత్సరాల మీనాక్షి మీనన్ టెక్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
‘జెన్స్ లైఫ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాట్‌ఫామ్ లాబ్ టెస్ట్ సర్వీసులు, ట్రావెల్, టాక్స్ ఫైలింగ్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ, సైబర్ సేఫ్టీ.. మొదలైన విషయాలలో వృద్ధులకు ఉపకరిస్తుంది. అడ్వర్‌టైజింగ్, మార్కెటింగ్, మీడియా కన్సల్టింగ్‌లలో మీనాక్షికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది.
అయిదు స్టార్టప్‌లకు యజమాని.‘పిల్లలను ఎలా పెంచాలి? అనే అంశంపై వందలాది పుస్తకాలు వచ్చాయి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై రాలేదు. ఈ నేపథ్యంలోనే వృద్ధులైన తల్లిదండ్రులకు సహాయపడే యాప్ రూపొందించాలనుకున్నాను’ అంటుంది మీనాక్షి మీనన్.
(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!)