
మల్బరీ పండ్లు శాస్త్రీయంగా మోరస్ జాతికి చెందినవి, తీపి, పులుపు రుచుకలను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్, జామ్, వైన్ ఇతర ఆహార పదార్థాలలో కలిపి ఉపయోగించవచ్చు. మల్బరీ పండ్లను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మల్బరీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో మంటలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మల్బరీలోని రెస్వెరాట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది రక్త నాళాలను సడలించి రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది, తద్వారా స్ట్రోక్స్, గుండె΄ోటు వంటి సమస్యలను నివారిస్తుంది.
మల్బరీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రక్షణను అందిస్తుంది.
మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి
అవసరం.
మల్బరీ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది కంటి చూపును బలపరుస్తుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.
మల్బరీ జ్యూస్ శస్త్రచికిత్స తర్వాత రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.