
చాలామంది ప్రముఖుల డైట్ సీక్రెట్‌ల గురించి విన్నాం. అలా చేస్తే మనం కూడా స్మార్ట్‌గా మారిపోవచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంటాయి అవి. కానీ అలా ఏదీ పడితే అది ఫాలో కావొద్దని చెబుతోంది ఈ 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్. శరీరం మాట వినండి, అందరికీ ఒక విధమైన డైట్ ఎట్టిపరిస్థితిలో సరిపడదని కూడా సూచిస్తోంది. ఈ వయసులో కూడా చురుగ్గా బరువులు ఎత్తే ఆమె తన డైట్ సీక్రెట్‌ని షేర్ చేసుకోవడమే గాక ఎలా ఆహారం తీసుకుంటే మంచిదో కూడా సూచించారు.
రోష్ని దేవి సంగ్వాన్ 68 సంవత్సరాల వయస్సులో వెయిట్‌లిఫ్టింగ్ ప్రారంభించి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారారు. ఆమె ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అంత లేటు వయసులు బరువులు ఎత్తడం మొదలు పెట్టినా..అంతలా ఎనర్జీగా చేసేందుకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందంటే..
రోజు పది బాదంపప్పులు, ఎండుద్రాక్ష తీసకుంటుందట. సాయంత్రం పెసరపప్పుతో చేసే అట్లు, పనీర్, ఒక కప్పు పాలు తీసుకుంటానని అన్నారు. చాలా తక్కువ మోతాదులో రైస్ తీసుకుంటానని చెప్పారామె. భారతీయ వంటకాలు శరీరానికి మంచి రిప్రెష్‌ని అందిస్తాయని అంటున్నారామె. పప్పు, బియ్యం, పెరుగు, ఓట్స్, బాదం, మూంగ్ చిల్లా, పనీర్‌లను కలిగి ఉన్న ఈ డైట్ ప్లాన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మిశ్రమాన్ని అందిస్తుంది.
శరీరం నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని, మెరుగైన ప్రేగు ఆరోగ్యం తోపాటు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలు ఉండేలా చేసే పోషకమైన ఆహారం ఇది. ఇక్కడ పెసరపప్పు, బాదం, పనీర్ వంటి పదార్థాలు జీవక్రియ, కండరాల మరమతఉకు మద్దతు ఇచ్చే అద్భుతమైన శాకాహార ప్రోటీన్ వనరులు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి ఈ ఆహారాలన్నీ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ..తినే క్వాండిటీ అనేది అత్యంత ప్రధానం అని చెబుతోందామె.
ఉదహారణకు నట్స్, పనీర్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీసుకునే క్వాండిటి ప్రధానం. అలాగే ఈ ఆహారాలు అందరికీ సరిపడకపోవచ్చని అంటున్నారామె. ఎందుకంటే కొందరికి లాక్టోస్ పడకపోవచ్చు, అలాగే వీటిలో కొన్ని పీసీఓడీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకోకూడనివి కూడా అయి ఉండొచ్చని అమె చెబుతున్నారు. ఇన్సులిన్, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు అవసరం కావొచ్చు.
అందువల్ల ఈ డైట్‌ని ఫాలో కావొద్దని చెబుతున్నారు రోష్ని దేవి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఆన్‌లైన్ కంటెంట్ ఆధారంగా ఆహారంలో మార్పులు చేయడం కంటే మంచి డైటీషియన్‌ని సంప్రదించి అనుసరించడమే మంచిదని సూచించారామె. చివరగా ఆమె ఒక్క విషయానికి తప్పక కట్టుబడి ఉండండని అంటున్నారామె.
భారతీయ భోజనం సదా శక్తిమంతంగా ఉంటుంది, వ్యక్తిగతమైనది కూడా అనేది గ్రహించండని అంటోందామె. ఒక వ్యక్తికి బాగా పనిచేసిన ఆహారం మరొకరికి ఇబ్బందికరంగా ఉండొచ్చని అన్నారు. అన్నింట్లకంటే మన శరీరం చెప్పింది వినాలని అన్నారామె. సో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి శరీరానికి సరపడా డైట్ తీసుకుని ఫిట్‌గా ఉందామా మరి..
(చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..)