
ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు. కండలు తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్‌తా మారానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించాడు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేశాడు. ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా 62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు.
'కార్బోనేటేడ్ డ్రింక్స్ చెత్త'
ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్ డ్రింక్‌లు, చక్కెర కార్బోనేటేడ్ డ్రింక్‌లకు బై బై చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు కూరగాయలు, చాలా సింపుల్‌గా మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినేవాడు.
'ట్రెడ్‌మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'
బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్ ఫుడ్‌పై దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్‌తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్‌మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ వెయిట్‌లాస్ జర్నీని కొనసాగించాడు. లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్‌గా మారాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి.
నోట్: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి.