
సత్తు పిండి గురించి ఎపుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.బరువు తగ్గడంలో ఎంతో సాయపడుతుంది. గుండె, షుగర్‌వ్యాధి గ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?
సత్తు పిండిని శనగపప్పు (చనా) లేదా ఇతర పప్పులను పొడిగా వేయించి, మెత్తని పిండిగా తయారు చేస్తారు. ఈ సత్తుపిండి, బెల్లం కలిపి లడ్డూలు చేసుకొని, ఇంకా వివిధ రూపాల్లో రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా, బరువు తగ్గవచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్ , ఇనుము, కాల్షియం ,మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆకలిని తగ్గించి, అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడంలో సహాయపడుతుంది.

సత్తు పిండి బరువు తగ్గడంలో ఎలా సాయపడుతుంది?
ప్రోటీన్ అధికంగా ఉండటం వలన మీరు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంది.
ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది కనుక కండరాలను బలిష్టం చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉండి, చిరుతిళ్లు తినకుండా నిరోధించవచ్చు. తద్వారా మనం తీసుకునే కేలరీల మోతాదు తగ్గుతుంది.
ఫైబర్ అధికంగా ఉంటుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం , ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ పోషకాలను సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. అనవసరమైన బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
జీవక్రియను పెంచుతుంది సత్తులో ఇనుము, మెగ్నీషియం , కాల్షియం జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి. అధిక జీవక్రియ కేలరీల బర్న్ చేయడానికి గంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇందులోని తక్కువ గ్లైసెమిక్రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బ్లడ్‌లోకి చక్కెరనునెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో షుగర్ స్థాయిలు సడన్‌గా పడిపోవడం, పెరిగిపోవడం లాంటివి ముప్పు తప్పుతుంది. రక్తంలో చక్కెర స్థాయి కారణంగా వచ్చే ఆకలి బాధలను నియంత్రింస్తుంది.
సత్తు సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తుంది, శరీరం నుండి విషాన్ని (టాక్సిన్స్) బయటకు పంపడంలో సహాయ పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అదనపు కేలరీలు లేకుండా శక్తిని అందిస్తుంది. అధిక కేలరీల ప్రాసెస్ చేసిన ఆహారాల మాదిరిగా కాకుండా, సత్తు అనేది సహజమైన శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. అనవసరమైన కొవ్వులు లేదా చక్కెరలు లేకుండా మంచి శక్తిని అందిస్తుంది.
సత్తుతో రెసిపీలు
సత్తు పానీయం
2 టేబుల్ స్పూన్ల సత్తును ఒక గ్లాసు నీరు, చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో కలపుకొని తాగవచ్చు. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్‌లో కేలరీలు తక్కువ. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ క్రమబద్ధీకరించడంతోపాటు, రోజంతా కడుపు నిండుగా ఉన్న అనుభూతి నిస్తుంది.
సత్తు మజ్జిగ: జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, మజ్జిగతో ఈ పిండిని కలిపి తాగవచ్చు. మజ్జిగ జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి సహాయపడితే, సత్తు ప్రోటీన్ , ఫైబర్‌ను అందిస్తుంది. సో ఇది బరువు తగ్గడానికి అనువైన పానీయంగా మారుతుంది.
సత్తు రోటీ లేదా పరాఠ : సత్తును గోధుమ పిండితో కలిపి పోషకమైన రోటీ లేదా పరాఠా తయారు చేసుకోవచ్చు.
సత్తులడ్డు: సత్తును బెల్లం, కొద్దిగా నెయ్యితో కలిపి లడ్డూలు సిద్ధం చేసుకొని తినవచ్చు. ఇది శక్తినివ్వడంతోపాటు, చక్కెర స్నాక్స్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.
నోట్ : ఇది సాధారణ అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఈ ఆహారాన్ని తీసుకునే ముందు మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించగలరు.