
టీవీ షోలు, తనదైన ప్రత్యేక పాత్రలతో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నటి నేహా ధూపియా (Neha Dhupia) . 2018లో నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె 45 ఏళ్ల నటి ప్రసవానంతర బరువు తగ్గినప్పుడు వార్తల్లో నిలిచింది. అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలగా 23 కిలోల బరువు తగ్గినవైనం విశేషంగా నిలిచింది. తక్కువ తినడం గురించి కాదు, సరిగ్గా తినడం గురించి తెలుసుకోవాలని తెలిపింది. మరింకెందుకు ఆలస్యం నేహా ధూపియా వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
నేహా ధూపియా ప్రసవానంతర బరువును ఎలా తగ్గించుకుందో మీడియాతో పంచుకుంది. నాలుగేళ్ల కాలంలో పదే పదే బరువు పెరిగాను, సన్నగా అయ్యాను. చాలా విమర్శలెదుర్కొన్నాను. అయినా సరే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవానంతర సమయంలో ఎలా ఉన్నాను అనేది పట్టించుకోలేదు. తల్లిగా తాను తన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప, బరువు తగ్గడం గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే లాక్‌డౌన్ సమయంలోనే తాను లో-కేలరీ డైట్‌పై దృష్టిపెట్టినట్టు చెప్పింది.
చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ
ఆతరువాత ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అదీ ఎలాంటి షార్ట్ కట్‌లు, క్రాష్ డైట్‌లూ లేకుండా. అయితే ఈ విషయంలో మొదట చాలా ఇబ్బందులు పడ్డాననీ కానీ సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చక్కెర, వేయించిన ఆహారాలు, గ్లూటెన్‌ను తగ్గించుకుంది. జిమ్‌కు వెళ్లడం తనకు పెద్దగా ఇష్టం ఉందనీ, అందుకే పరుగు లాంటి వ్యాయామ దినచర్యను ఎంచుకు న్నానని వెల్లడించింది. అలా తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, దానికి తగ్గ ఆహారం, వ్యాయామంతో ఏడాది కాలంలో దాదాపు 24 కిలోలు బరువును తగ్గించుకుంది.
ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి
నేహా ధూపియా ఇంకా ఇలా పంచుకున్నారు. నిజానికి ఇందులో దీనికి షార్ట్ కట్స్ లేవు, అంత ఈజీకూడా కాదు రాకెట్ సైన్స్ కూడా లేదు, గట్టి నిలబడండి, స్థిరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. ముఖ్యంగా మీకు అస్సలు మనస్కరించని రోజుల్లో ఇంకా స్ట్రాంగ్‌గా ఉండండి అని తెలిపింది. ఈ శారీరక మార్పులు తన మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా సహాయపడ్డాయో కూడా వివరించింది. "ఆరోగ్యంగా ఉండటం వల్ల నా పిల్లలతో కలిసి చురుగ్గా ఉండటానికి తోడ్పడింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. మానసిక బలానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించింది. రాత్రి 7 గంటల కల్లా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు అంటూ వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ని పంచుకున్నారామె. అంతేకాదు చాలామందిలాగా క్రాష్ డైట్లు, జిమ్ కసరత్తులు లేకుండానే వ్యాయామాలతో సింపుల్ లైఫ్‌స్టైల్‌తోనే తాను అనుకున్న వెయిట్‌లాస్ సాధించానని తెలిపింది.
కాగా నేహా ధూపియా -అంగద్ బేడీ దంపతులకు ఇద్దరు సంతానం. (కూతురు మెహ్ర్, కొడుకు గురిఖ్) మొదటినుంచీ కాస్తా బొద్దుగా ఉండే నేహా, ప్రెగ్నెన్సీ సమయాల్లో బాగా బరువు పెరిగింది. దీంతో ‘దాదీ ధూపియా, గ్రాండ్‌మా ‘మోటీ, తిమింగలం అంటూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, అటు ఇంటిని, ఇటు కరియర్‌ను చక్కదిద్దుకున్న సూపర్‌మామ్ నేహా ధూపియా.