
బహుభార్యత్వం కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న యూట్యూబర్ అర్మాన్ మాలిక్ మరోబిడ్డకుతండ్రి కాబోతున్నాడుట. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల ఇలా వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలిచే అర్మాన్‌మాలిక్ రెండో భార్య కృతిక రెండో బిడ్డకు తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే గతంలో రెండో ప్రెగ్నెన్సీపై గతంలో తన వ్లాగ్‌లో జోక్ లేసింది. దీంతో అభిమానులు కన్‌ఫ్యూజన్‌లోఉన్నారు. ఇటీవల పటియాలో కోర్టులో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ పెట్టిందా? అనే సందేహాలను నెటిజనులు వ్యక్తం చేశారు.
హర్యానాకు చెందిన అర్మాన్‌మాలిక్ యూట్యూబర్‌గా, బిగ్‌బాస్ ఓటీటీఫేమ్‌గా పాపులరయ్యాడు. ఆ తరువాత వరుస పెళ్లిళ్లు, పిల్లలతో తరచూ చర్చల్లో నిలుస్తున్నాడు. తాజాగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ దవీందర్ రాజ్‌పుత్ అనే వ్యక్తి అర్మాన్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అర్మాన్, అతని ఇద్దరు భార్యలు పాయల్ ,కృతికలను సెప్టెంబర్ 2న హాజరు కావాల్సిందిగా మూడు నోటీసులతో సమన్లు జారీ చేసింది కోర్టు.
కాగా అర్మాన్ 2011లో పాయల్ ను వివాహం చేసుకున్నాడు. 2018లో పాయల్ ప్రాణ స్నేహితురాలు కృతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో పాయల్ కవలలకు జన్మనివ్వగా, కృతిక ఒక మగబిడ్డనుకంది. ఇప్పుడు కృతిక తన ఇన్‌స్టాగ్రాంలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాయల్ కూడా కృతికతో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇది నిజమైన గర్భధారణ ప్రకటననా, లేక ఏదైనా బ్రాండ్ ఎండార్స్‌మెంటా? లేక మరేదైనానా అనే తర్జనభర్జనలో ఉన్నారు మాలిక్ ఫ్యాన్స్ .
ఇదీ చదవండి: నాలుగు పెళ్లిళ్లా?! ప్రముఖ యూట్యూబర్‌కు షాక్, కోర్టు సమన్లు