
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ అర్మాన్ మాలిక్ (Armaan Malik)కు ఊహించని షాక్ తగిలిగింది. ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో వార్తల్లో నిలిచిన అర్మాన్ మాలిక్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ ఆయనకు పటియాలా కోర్టు నోటీసులు జారీ చేసింది.
హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించి మాలిక్ నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడని వాదిస్తూ న్యాయవాది దావీందర్ రాజ్‌పుత్ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఒక భాగస్వామిని మాత్రమే వివాహం చేసుకోవచ్చు. కానీ అర్మాన్ మాత్రం తన పేరుతో రెండు కాదు ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నాడని ఇది బహుభార్యత్వం కిందికి వస్తుందని తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతోఅర్మాన్ మాలిక్, అతని భార్యలకు కోర్టు సమన్లు జారీ చేసింది. బహుభార్యత్వం ,మతపరమైన ఉల్లంఘన ఆరోపణలపై కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. అర్మాన్ మాలిక్, అతని భార్యలు పాయల్, కృతికా మాలిక్‌ల వివాహాల చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి వారు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వ్యవహారం ఇపుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
కాగా అర్మాన్ మాలిక్ అసలు పేరు సందీప్. హర్యానాలోని హిసార్ కు చెందిన ఆయన గతంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి ఢిల్లీకి వెళ్లి కంటెంట్ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నాడు. 2024 జూన్ 21న ప్రారంభమైన బిగ్ బాస్ OTT సీజన్ 3లో తన ఇద్దరు భార్యలతో కలిసి ఎంట్రీ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం పాయల్,కృతికా అనే ఇద్దరు భార్యలతో జీవిస్తున్నాడు. మొదటి భార్య పాయల్, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త , ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. 2018లో అర్మాన్‌ను వివాహం చేసుకున్న కృతిక మధ్యలో విడిపోయినా ఇపుడు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. పాయల్ మాలిక్‌తో వివాహానికి ముందు, అర్మాన్ మాలిక్ 17 సంవత్సరాల వయసులో సుమిత్ర అనే మహిళను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అర్మాన్ మాదిరిగానే సుమిత్ర కూడా హర్యానాకు చెందినది, మరియు ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతారు.2024 చివరలో, అర్మాన్ మాలిక్‌కు నాల్గవ భార్య ఉందని పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: Beauty Tips వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో!