
జయా బచ్చన్ సెల్పీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి రాజ్యసభ ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ సెల్ఫీ వివాదంపై మరోనటి బీజేపీనేత రూపాలీగంగూలీ స్పందించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై రూపాలీ అలియాస్ అనుపమ కూడా విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ మరోసారి తన సహనాన్ని కోల్పోయిన వీడియోపై రూపాలి గంగూలీ స్పందిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో జయ బచ్చన్ నుండి నటన నేర్చుకున్నప్పటికీ, ఇపుడు మాత్రం ఆమె నుంచి బిహేవియర్ లక్షణాలను ఎప్పటికీ నేర్చుకోకూడదని భావిస్తున్నా అన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ జయా బచ్చన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
కాగా అయితే పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ సహనం కోల్పోయిన గతంలో కూడా వివాదాన్ని రేపాయి.అలాగే ఇటీవల ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా కూడా జయాబచ్చన్ సహనం కోల్పోయారు. గత ఏడాది జూలై-ఆగస్టులో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ఆమెను సభకు పరిచయం చేస్తూ ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడాన్ని తీవ్రంగా తప్పపట్టారు.అమితాబ్ పేరుతో కలిపి తనను పరిచయం చేయడం నచ్చలేదని అన్నారు.కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమాంలో వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి ఆమె వద్ద వచ్చినపుడు అతనిపై కోప్పడటమేకాదు, అతణ్ణి తోసి వేయడంతో జయా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.