130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే.. | Woman reveals how she lost over 75kg With 5 Simple Steps | Sakshi
Sakshi News home page

Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..

Jun 17 2025 4:03 PM | Updated on Jun 17 2025 5:39 PM

Woman reveals how she lost over 75kg With 5 Simple Steps

అధిక బరువు సమస్య అనేది అలాంటి ఇలాంటిది కాదు. వచ్చిందంటే తగ్గదు.. అన్నంతగా వేధిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. స్లిమ్‌గా మారాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే స్ట్రాంగ్‌ మైండ్‌సైట్‌తో శరీరంపై ఫోకస్‌ పెట్టి తగ్గినవారెందరో ఉన్నారు. అదే సమయంలో సత్ఫలితాలను పొందలేక ఢీలా పడ్డవాళ్లు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మనం సిన్సియర్‌గా బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలన్ని అస్సలు వర్కౌట్‌ కావు. అసలు అలా ఎందుకు జరుగుతుందన్నది క్షణ్ణంగా ఆలోచిస్తేనే..అధిక బరువు సమస్య నుంచి బయటపడగలం లేదంటే అంతే సంగతులు. అచ్చం అలానే చేసింది ఈ 53 ఏళ్ల  సారా జేన్ క్లార్క్. ఆమె ఎంత బరువు ఉండేది తెలిస్తే విస్తుపోతారు. ఆమెలాంటి వాళ్లు తగ్గాలంటే బరువు తగ్గించే ఇంజెక్షన్‌ల సాయంతోనే సాధ్యం. కానీ ఆమె వాటి జోలికి పోకుండానే బరువు తగ్గి చూపించింది. ఎలాగంటే..?..

సారా జేన్ క్లార్క్ టీనేజ్‌ వయసులోనే 130 కిలోల అధిక బరువుతో బాధపడేది. ఆమె ఉదయం క్యాడ్‌బరీ చాక్లెట్లు, కోకా కోలాతో మొదలయ్యేది. చక్కెర లేని పదార్థాలను ముట్టుకునేదే కాదు. అంతలా స్వీట్లకు బానిసైంది. అయితే కాలేజ్‌లో ఆమె స్నేహితులంతా నువ్వు లావుగా లేకపోతే ఎంతో అందంగా ఉండేదానివి అన్న మాటలు సారాను విపరీతంగా బాధించేవి. 

25 ఏళ్లేక మరింత లావైపోయి..పీరియడ్స్‌ ఆగిపోయి వృద్ధాప్యానికి చేరువైన వ్యక్తుల మాదిరిగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సారా పరిస్థితిని చూసి వైద్యులు కనీసం 40 ఏళ్లు వచ్చే వరకు కూడా బతకడం కష్టమే అని చెప్పేశారు. ఆ మాటలే ఆమెపై పవర్‌ఫుల్‌ మంత్రంలా పనిచేశాయి. అప్పడే ఆమె ఎలాంటి క్రాష్‌ డైట్‌..వెయిట్‌ లాస్‌ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండానే బరువు తగ్గి చూపించాలని స్ట్రాంగ్‌గా

ఐదు నియమాలు..

  • రోజూ 30 నిమిషాల నడక, అధికంగా నీరు తీసుకోవడం. 

  • అలాగే ఎలాంటి ఆర్డర్లు వేయకుండా అన్ని పనులు చేసుకోవడం

  • ప్రాసెస్‌ చేసిన ఆహారాలను నివారించడం

  • తీసుకునే ఆహారంలో అధికంగా ఫుడ్‌ ఉన్నట్లయితే అస్సలు ముట్టుకోకుండా ఉండటం

  • బరువు తగ్గే క్రమంలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేలా మైండ్‌సైట్‌లో మార్పు

కాలక్రమేణ ఈ రూల్స్‌ అద్భుతమైన ఫలితాలను అందుకునేలా చేసి కేవలం 16 నెలల్లో..అనూమ్యంగా 44 కిలోల బరువు తగ్గిపోయింది. అందంగా మారడమే గాక ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెళ్లై ఇద్దరు పిల్లులు పుట్టాక కూడా..అదే పద్ధతిని కొనసాగించింది. 

అలా సారా డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి ఎల్‌ సైజ్‌తో స్లిమ్‌గా మారిపోయింది. పైగా తన 40వ పుట్టిన రోజుని గ్రాండ్‌గా జరుపుకుంది కూడా. అంతేగాదు ఆరోగ్య స్ప్రూహను కొనసాగిస్తూ..అందరికి అవగాహన కల్పించేలా 5K రన్‌ వంటి మారథాన్‌లలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె 62 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.

అలా చేస్తే మనకు మనం నచ్చం..
బరువు తగ్గించే ఇంజెక్షన్ల క్రేజ్‌ ఉన్నా..వాటిపట్ల జాగ్రత్త వహించాలంటోంది. ఇంజెక్ట్‌  చేసుకుని మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం. బరువు తగ్గాకా.. అబ్బా స్లిమ్‌గా మారిపోయే అనే గొప్ప అనుభూతి కలుగుతుందా..? అని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన నియమాలను మనకు సాధ్యమైనవి ఎంపిక చేసుకుని తూచా తప్పకుండా పాటించండి చాలు..అద్భుతాలు సృష్టించొచ్చు అని నమ్మకంగా చెబుతోంది.

 

(చదవండి: లావణ్య బెల్లీ డ్యాన్స్‌కు..నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..)

 

Advertisement
 
Advertisement
Advertisement