
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్‌ఆర్‌వీఎల్) తాజాగా యూకే సంస్థ ఫేస్‌జిమ్‌లో మైనారిటీ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా దేశీయంగా ఫేషియల్ ఫిట్‌నెస్, స్కిన్‌కేర్ బ్రాండును ప్రవేశపెట్టనుంది. తాజా పెట్టుబడులతో దేశీయంగా అధిక వృద్ధిలోనున్న సౌందర్యం, వెల్‌నెస్ విభాగంలో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే వాటా కొనుగోలు విలువను వెల్లడించలేదు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
ఓమ్నిచానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫామ్ ‘టిరా’ ద్వారా ఫేస్‌జిమ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు తాజా భాగస్వామ్యం వీలు కల్పించనున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో ఫేస్‌జిమ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కీలక పట్టణాలలో స్టాండెలోన్ స్టుడియోలు, ఎంపిక చేసిన టిరా స్టోర్ల ద్వారా ఇందుకు అవకాశాలను సృష్టించనున్నట్లు వివరించింది.