జిమ్‌కి వెళ్లడం బోర్‌గా అనిపిస్తోందా? అయితే ఈ కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ మీకు ఒక ‘ఫన్ వర్కౌట్’లా అనిపించొచ్చు! ఎందుకంటే ఇందులో మనుషులు జంతువుల్లా చేతులు, కాళ్లు నేల మీద వేసుకుని పరుగెడతారు. పేరు ‘క్వాడ్రోబిక్స్(Quadrobics)’! కాని, ఫిట్‌నెస్ ప్రేమికులు దీన్ని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కౌట్’ అంటున్నారు. అంతే కాదు, సాధారణ వర్కౌట్స్ మాదిరి గంటల తరబడి కాకుండా, కేవలం ఐదు నిమిషాలే చేస్తే ఊపిరి బిగుసుకుంటుంది! అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
అయితే, వైద్యులు మాత్రం ‘ఇది కాస్తా జంతువుల్లా ప్రవర్తించే అలవాటుగా మారితే ప్రమాదం!’అని హెచ్చరిస్తున్నారు. చేతులు, మణికట్టు, భుజాలు ఇవన్నీ మన బాడీకి ఈ లోడ్‌కి అలవాటు ఉండవు. కాబట్టి ఫిట్‌నెస్ కన్నా ఫ్రాక్చర్ ఫాస్ట్‌గా రావచ్చు! అని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘ఫోర్ లెగ్ ఫిట్‌నెస్’ శరీరానికి కాకపోయినా, లైక్స్‌కి మాత్రం బాగా పని చేస్తోంది!


