సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్‌కిడ్‌ నెట్‌వర్త్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు | Sakshi
Sakshi News home page

సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్‌కిడ్‌ నెట్‌వర్త్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు

Published Sat, May 25 2024 4:04 PM

Meet star kid Krishna Shroff who earns in crores

ఆమె ఒక  సూపర్ స్టార్ కూతురు.  దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది.  స్టార్‌ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లాగా   సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు.  కానీ స్టార్‌ హోదాలో కోట్లు సంపాదిస్తోంది.  ఇంతకీ ఎవరీ స్టార్‌ కిడ్‌? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి!  

సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ  సినీ రంగంలోనే  కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.

ఆ స్టార్‌ కిడ్‌ ఎవరో కాదు  బాలీవుడ్‌  స్టార్‌ యాక్టర్‌  జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్‌స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను  కొన సాగిస్తున్నాడు.  

1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది.  సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .

సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్‌ అంటే ప్రాణం పెడుతుంది.  ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్‌- ట్రైనింగ్‌ కేంద్రాన్ని  స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి.

 నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా  మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’  

అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్‌లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో  కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. 

ఫిట్‌నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ  రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్‌ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement